రుచికరమైన కరివేపాకు పచ్చడి.. ఇలా చేయండి..!

Suma Kallamadi
కరివేపాకు కూరలో రుచి, సువాసన ఇవ్వడమే కాదు.. వాటిని రోజూ వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలూ కలుగుతాయి. అంతేకాదు.. కరివేపాకులో పోషకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.
కరివేపాకులో క్యాలరీలు - 108, కార్బోహైడ్రేట్లు - 18, ఫైబర్‌ - 6.4 గ్రా, ప్రొటీన్‌ - 6 గ్రా ఉన్నాయి. ఇంకా క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, జింక్‌, సి-విటమిన్‌, కాపర్‌, మెగ్నీషియంలు మైక్రోగ్రాముల్లో లభిస్తాయి. కంటిచూపును కాపాడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలం. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. అయితే చాలా మంది కరివేపాకును పచ్చడి రూపంలో తింటుంటారు. కరివేపాకు పచ్చడిని ఎలా తాయారు చేస్తారో ఒక్కసారి చూద్దామా.
కరివేపాకు పచ్చడికి కావలసిన పదార్దాలు:
 కరివేపాకు కట్టలు - ఐదు (చిన్నవి), ఎండుమిర్చి - పది, చింతపండు - నిమ్మకాయంత, పసుప్పు - అర టీస్పూన్‌, ధనియాలు అర టీస్పూన్‌, నువ్వులు - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, ఇంగువ - రెండు చిటికెడులు, నూనె - రెండు టీస్పూన్లు, శనగపప్పు - అర స్పూన్‌, మినప్పప్పు - అర స్పూన్‌, ఆవాలు - అర స్పూన్‌, జీలకర్ర - అర స్పూన్‌.
కరివేపాకు పచ్చడి తాయారు చేసే విధానం:
ఇక ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టుకోవాలి. నువ్వుపప్పు దోరగా వేగించాలి. స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక శెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.  ఆ పోపును ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో ఎండుమిర్చి వేసి వేగించాలి. కాసేపయ్యాక కరివేపాకు వేయాలి. చింతపండు వేసి స్టవ్‌పై నుంచి దింపాలి. చల్లారాక అన్నీ కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు కలిపి పచ్చడి తయారీ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: