ఇంట్లోనే రుచికరమైన మసాలా బాత్‌ ఇలా ట్రై చేయండి..!

Suma Kallamadi
బయటి ఫుడ్ తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ఆలా కాకుండా ఇంట్లోనే రుచికరమైన వంటలు చేసుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఇంట్లోనే రుచికరమైన మసాలా బాత్‌ ట్రై చేయండి.
మసాలా పొడి కోసం కావాల్సిన పదార్దాలు:
ధనియాలు - ఒకటేబుల్‌స్పూన్‌, జీలకర్ర-అర టీస్పూన్‌, నువ్వులు- అరటీ స్పూన్‌, యాలకులు -2, దాల్చినచెక్క- కొద్దిగా, లవంగాలు-5, ఎండు కొబ్బరి- చిన్న ముక్క, మిరియాలు- పావు టీస్పూన్‌.
మసాలా బాత్‌ కోసం:
నెయ్యి ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు-ఒక టీస్పూన్‌, జీలకర్ర - అరటీస్పూన్‌, బిర్యానీ ఆకు -ఒకటి, ఇంగువ- చిటికెడు, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూన్‌, టొమాటో- 1, జీడిపప్పు- 10 పలుకులు, క్యారెట్‌- ఒకటి, బంగాళదుంప- 1, పసుపు- చిటికెడు, ఎండుమిర్చి- అర టీస్పూన్‌, బాస్మతి బియ్యం - ఒకకప్పు, నీళ్లు - రెండున్నరకప్పులు, ఉప్పు - రుచికి తగినంత, కొబ్బరి పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట.
మసాలా బాత్‌ తాయారు చేసే విధానం:
ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేగించాలి. తరువాత వాటిలో లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, ఎండుకొబ్బరి, మిరియాలు వేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్‌ చేసి మసాలా సిద్ధం చేసుకోవాలి. ఠి ఒక పాత్రలో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి. ఠి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మరికాసేపు వేగించాలి. ఠి ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, పసుపు వేసి వేగించాలి. ఇంగువ వేయాలి.
టొమాటో, క్యారెట్‌, బంగాళదుంప ముక్కలు వేసి కలియబెట్టాలి. ఠి ఇప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా వేసి చిన్నమంటపై మరికాసేపు ఉంచాలి. ఠి ఇప్పుడు బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోయాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఠి అన్నం ఉడికిన తరువాత దింపుకొనే ముందు కొబ్బరిపొడి, కొత్తిమీర వేయాలి. రైతా తీసుకుంటే మసాలా బాత్‌ రుచిగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: