ఇంట్లోనే రుచికరమైన మటన్ పులావ్ ఇలా తాయారు చేసుకోండి..!

Suma Kallamadi
నేటి సమాజంలో చాల మందికి వంట రాదు. ఇక పులావ్, బిర్యానీ అనగానే చాలా మంది బయటికి ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. ఇక ఇంట్లో పులావ్.. బిర్యాని.. వంటివి తయారు చేయడం కొంచెం కష్టమే. అలాగని రెస్టారెంట్లలో ఆర్డర్ చేస్తే ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అందుకే ఆదివారాల్లో, కొంచెం ఎక్కువ సమయం ఉన్నపుడు ఇంట్లోనే ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. వండేటపుడు కొంచెం కష్టమనిపించినా.. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక రెస్టారెంట్ రుచితో మటన్ ‌తో పులావ్ చేస్తే ఆహా ఏమి రుచి.. అనాల్సిందే. మరి ఇక ఎందుకు ఆలస్యం మటన్ పులావ్ తాయారు చేసే విధానాన్ని ఒక్కరి చూడండి. ఇంట్లోనే రుచికరమైన టేస్టీ, టేస్టీ మటన్ పులావ్ ని రెడీ చేసుకోండి.
మటర్‌ పులావ్ కు కావాల్సిన పదార్దాలు:
బాస్మతి రైస్‌ ఓ కప్పు,
పచ్చి బఠానీలు: ముప్పావు కప్పు,
ఉల్లి ముక్కలు: సగం కప్పు,
నెయ్యి లేదా బటర్‌: మూడు స్పూన్లు,
జీలకర్ర: స్పూను,
దాల్చిన చెక్క: ఓ ముక్క,
లవంగాలు: మూడు,
బిర్యానీ ఆకులు: రెండు ,
నూనె, నీళ్లు, ఉప్పు: తగినంత
మటర్‌ పులావ్‌ తాయారు చేసే విధానం:
అయితే ముందుగా బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి అరగంట పాటు నీళ్లు పోసి నానబెట్టాలి. ఆ తర్వాత ప్రెషర్‌ కుక్కర్ ‌లో నూనె వేసి కొంచెం వేడెక్కాక జీలకర్రతో పాటు మసాలా దినుసులన్నీ వేసి కాస్త వేయించాలి. ఆ తరవాత ఉల్లి ముక్కలు వేసి ఎర్రగా మగ్గే వరకు వేపాలి. ఆ తర్వాత పచ్చి బఠాణీలు వేసి ఓ నిమిషం పాటు వేయించాలి. దింట్లో నీళ్లు ఒంపేసిన బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలపాలి. తర్వాత ఉప్పు కూడా వేయాలి. అవసరమైన మేరకు నీళ్లను పోసి కుక్కర్‌ మూతను పెట్టాలి. రెండు విజిల్స్‌ రాగానే దింపేస్తే వేడి వేడి మటర్‌ పులావ్‌ రెడీ. ఇలాంటి టేస్టీ ఫుడ్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: