చికెన్ పాప్ కార్న్ తయారీ విధానం మీకోసం.. !!

Suma Kallamadi
ఈ కాలంలో ఎవరు చూసినాగాని హోటల్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినడానికి అలవాటు పడిపోతున్నారు. కానీ హోటల్ ఫుడ్  ఎంత బాగున్నా కానీ మన ఇంట్లో చేసే వంట రుచే వేరు కదా.కానీ మనం ఇంట్లో చేసుకునే వంట ఎదన్నాగాని శుభ్రంగా చేసుకుంటాము కదా. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామా.. ఈరోజు స్పెషల్ రెసిపీ చికెన్ పాప్ కార్న్. సాధారణంగా పాప్‌కార్న్  అంటే పిల్లలు,పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు..ఈ పాప్‌కార్న్ ను కేవలం మొక్కజొన్నతో కాకుండా చికెన్‌తో కూడా చేసుకోవచ్చు తెలుసా.!మరి ఆలస్యం చేయకుండా  చికెన్ పాప్‌కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దామా.. !!

 
కావలిసిన పదార్ధాలు :
250 గ్రాముల బోన్‌లెస్ చికెన్
2 టేబుల్ స్పూన్ల అల్లం, వెల్లుల్లి పేస్ట్
1 టేబుల్ స్పూన్ చొప్పున నిమ్మరసం,
 జీలకర్ర పొడి- కొద్దిగా
గరం మసాలా-కొద్దిగా
పాలు- కొద్దిగా
1/2 కప్పు మైదా
1 గుడ్డు
4 బ్రెడ్ స్లైసెస్
ఉప్పు రుచికి సరిపడా


తయారీ విధానం :
చికెన్‌ను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కడిగిన చికెన్‌ ముక్కలకు అల్లం, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు వేసి 20 నిమిషాల పాటు  నానబెట్టాలి. ఈలోపు బ్రెడ్ ముక్కలను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు కాల్చాలి. దానిని మిక్సీలో పౌడర్‌గా మార్చాలి. తరువాత బ్రెడ్ పౌడర్‌కు జీలకర్ర, గరం మసాలాను కలపండి. తరువాత ఒక గిన్నెలో గుడ్డు పగలగొట్టి దానికి పాలు పోసి బాగా కలపండి. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. తరువాత ముందుగా నానపెట్టుకుని ఉన్న చికెన్ ముక్కలను  విడివిడిగా తీసుకొని గుడ్డు మిశ్రమంలో డిప్ చేయాలి. తరువాత పిండిలో వేసి అన్ని వైపులా అంటుకునే విధంగా పొర్లించాలి. తరువాత మళ్లీ గుడ్డులో డిప్ చేయాలి. చివరకు బ్రెడ్ ముక్కల్లో అద్ది కాగుతున్న నూనెలో వేయాలి. చికెన్ అంతా బంగారు రంగు వచ్చేవరకు మీడియం మంట మీద వేయించాలి. అంతే కరకరలాడే చికెన్ పాప్‌కార్న్ రెడీ. సాయంత్రం పూట స్నాక్స్ గా కూడా వీటిని తినవచ్చు.. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: