ఎంతో రుచికరమైన పాలకూర చికెన్ ఎలా తయారు చేయాలో చూడండి.. !

Suma Kallamadi
చికెన్  అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అలాగే ఎప్పుడు రొటీన్ గా వండితే ఏమి బాగుంటుంది చెప్పండి. అందుకే ఈసారి వెరైటీగా చికెన్ లో పాలకూర వేసి వండి చూడండి. ఎంతో రుచికరమగా ఉంటుంది. అలాగే పాలకూర కూడా మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ఈ రెసిపీని పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా పాలకూర చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామా.. !
కావల్సిన పదార్థాలు: *
చికెన్ - 350 గ్రా
పాలకూర - 300 గ్రా
నూనె - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి - 6 రెబ్బలు
ఏలకులు - 2
దాల్చిన చెక్క- 2 అంగుళాలు
లవంగం - 3
అల్లం - సరిపడా
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ - 2 (సన్నగా తరిగినవి)
మిరపపొడి - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా - 1 టేబుల్ స్పూన్
ఫ్రెష్ క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
రెసిపీ తయారుచేయు విధానం:  
మొదట చికెన్ ను నీటిలో వేసి బాగా కడగాలి. తరువాత స్టౌ మీద కుక్కర్ పెట్టి అందులో పాలకూర, పచ్చిమిరపకాయలు కొన్ని నీళ్లు వేసి కుక్కర్‌ మూత పెట్టి ఒక విజిల్‌ వచ్చే వరకు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లబరచండి. ఆ తర్వాత వెంటనే కుక్కర్ విజిల్ తొలగించి మూత తెరవండి. దాని వల్ల, పాలకూర యొక్క రంగు  మారదు. పాలకూర బాగా చల్లబడిన తర్వాత మిక్సర్ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టౌ మీద పాన్ పెట్టి, అందులో వేయించడానికి నూనె వేసి అందులో నెయ్యి పోసి వేడిగా ఉన్నప్పుడు ఏలకలు, లవంగాలు, వేసి లైట్ గా వేగించుకోవాలి. తర్వాత అందులోనే చికెన్ ముక్కలు వేసి వేగించాలి.  తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించాలి. అవి వేగాక అందులోనే  ఉప్పు, కారం పొడి, గరం మసాలా వేసి బాగా కలబెట్టాలి. తరువాత వేయించడానికి పాన్ కు మూత పెట్టి తక్కువ వేడి మీద వంటకం బాగా ఉడికించాలి. అవసరమైతే చికెన్ బాగా మెత్తగా ఉడకడానికి మీరు కొద్దిగా నీరు కలపవచ్చు. చికెన్ ఉడికిన తరువాత చివరగా పాలకూర పేస్ట్ వేయాలి. కొంచెం ఉడికిన తరువాత అందులో  ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలపాలి, తర్వాత 4-5 నిమిషాలు పాటు తక్కువ మంట మీద ఉంచి ఉడికించాలి.అంతే ఎంతో కలర్ ఫుల్ గా, రుచికరంగా ఉండే పాలక్ చికెన్ కర్రీ రెడీ అయినట్లే.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: