అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలా.. !!

Suma Kallamadi

అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎంత ఫేమస్ అయినదో మన అందరికి బాగా తెలుసు. కానీ చాలా మందికి ఆ ప్రసాదం ఎలా తయారుచేస్తారో అనే విషయం తెలియదు. అందుకే ఈరోజు మీకు ఈరోజు అన్నవరం ప్రసాదం ఎలా తయారు చేయాలో చెబుతాము. ఏదన్నా పండగలప్పుడు మీరే స్వయంగా ఇంట్లో తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా పెట్టండి. అయితే ఈ రెసిపీ తయారు చేయడానికి మీరు కొన్ని టిప్స్ పాటించాలి మరి. ఈ రెసిపీ కోసం మీరు ఎర్ర గోధుమ నూకని మాత్రమే వాడాలి.అలాగే ఒక కప్ గోధుమ రవ్వకి కప్ పంచదార, కప్ బెల్లం తురుము, 3-4 కప్స్ నీళ్ళు తీసుకోవాలి.
కావాల్సిన పదార్ధాలు
1 cup ఎర్ర గోధుమ రవ్వ
1 cup పంచదార
1 cup బెల్లం తురుము
1/3 cup నెయ్యి
సెనగబద్దంత జాజికాయ ముక్క
1/4 tsp పటిక
4-5 యాలకలు
2 చిటికెళ్ళ కుంకుమపువ్వు
3 నీళ్ళు
తయారీ విధానం :.
ముందుగా జాజికాయ, పటిక, యాలకలు, కుంకుమపువ్వు వేసి బాగా దంచి పొడి చేసుకుని పక్కన ఉంచుకోండి. తరువాత అడుగు మందంగా ఉన్న మూకుడులో గోధుమ నూక వేసి సన్నని సెగ మీద కలుపుతూ నూక తెల్లగా అయ్యేదాకా వేపుకుని పక్కనుంచుకోవాలి.అదే మూకుడులో 3 కప్పుల నీరు పోసి ఎక్కువ మంట  మీద ఎసరుని బాగా కాగనివ్వాలి.
ఎసరు మరుగుతుండగా అందులో ముందుగా వేపుకున్న రవ్వ వేసి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేం మీద రవ్వని మెత్తగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన రవ్వలో పంచదార పోసి కరిగించి మధ్య మధ్యలో కలుపుతూ 20 నిమిషాలు ఉడికిస్తే మంచి రంగులోకి వస్తుంది, అప్పుడు బెల్లం తురుము వేసి కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి పాకం పైకి తేలి ప్రసాదం కుతకుతలాడుతూ ఉడుకుతుంది, అప్పుడు నెయ్యి పోసి కదపకుండా మూతపెట్టి 5-6 నిమిషాలు వదిలేయాలి.-6 నిమిషాలకి నెయ్యిలో మరిగి మంచి బంగారులోకి వస్తుంది ప్రసాదం, అప్పుడు దంచుకున్న సుగంధద్రవ్యలన్నీ వేసి బాగా కలిపి చిక్కబడేదాక ఉంచి దింపేయాలి.అయితే ప్రసాదాన్ని వేడి మీదే విస్తరాకులో చుట్టి ఉంచితే ఆకు పరిమళం ప్రసాదానికి పట్టి అన్నవరం ప్రసాదం రుచి వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: