రుచికరమైన పాలక్ పరోటా ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
పాలక్ మంచి ఆకుకూర. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఎన్నో వున్నాయి. అవి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో వుండే ఐరన్ చిన్న పిల్లలు బాగా బలంగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. పాలక్ తో మనం అనేక రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. కాని ఎప్పుడైనా పాలక్ పరోటా ట్రై చేశారా?పాలక్ పరోటా ఎంతో రుచికరమైన వంటకం. ఇక ఇది ఎలా చెయ్యాలో తెలుసుకోండి...
రుచికరమైన పాలక్ పరోటా తయారు చెయ్యడానికి కావలసిన పదార్ధాలు:
గోధుమపిండి, మైదాపిండి – 1 కప్పు చొప్పున, పాలకూర – 1 కట్ట,
నిమ్మరసం – 1 టీ స్పూన్‌,
పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్‌,
అల్లం పేస్ట్‌ – 1 టీ స్పూన్‌,
ఉప్పు – తగినంత,
నీళ్లు – కావాల్సినన్ని,
నూనె/నెయ్యి – సరిపడా
రుచికరమైన పాలక్ పరోటా తయారు చేసే విధానం:
ముందుగా పాలకూర పరోటా తయారు చేసే ముందు పాలకూరను బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక శుభ్రం చేసుకున్న తరువాత మిక్సీ బౌల్‌లో వేసుకుని,ఇక అందులో నిమ్మరసం, అలాగే 2 టేబుల్‌ స్పూన్ల నీళ్లు వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్‌ తీసుకుని.. అందులో గోధుమపిండి, మైదాపిండి, అల్లం పేస్ట్, పాలకూర పేస్ట్, తగినంత ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుని చపాతి ముద్దలా చేసుకుని.. ఆ ముద్దకు తడి వస్త్రాన్ని చుట్టి.. అరగంట పాటు పక్కనపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని నిమ్మకాయ సైజ్‌ ఉండలులా చేసుకుని.. చపాతీ కర్రతో ఒత్తుకుని.. మరోసారి మడిచి మళ్లీ చపాతీలా ఒత్తి.. పెనంపై నెయ్యి లేదా నూనెతో ఇరువైపులా దోరగా కాల్చుకోవాలి.ఇక పాలక్ పరోటా తయారైనట్లే. ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన పాలక్ పరోటాలను మీరు ఇంట్లో తయారు చెయ్యండి. హ్యాపీగా తినండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: