బెండకాయ మసాలా కర్రీ ఎలా చెయ్యాలో తెలుసుకోండి..

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...బెండకాయ మంచి వీజిటెరియన్ ఫుడ్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చిన్న పిల్లలు తింటే వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కాబట్టి పిల్లలకి బెండకాయ కర్రీ చిన్న వయసు నుంచే అలవాటు చెయ్యండి. ఇక రుచికరమైన బెండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...


బెండకాయ మసాలా కర్రీకి కావలసిన పదార్ధాలు :


నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; బెండకాయలు – పావు కిలో; జీలకర్ర – ఒక టీ స్పూన్‌; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్‌; పసుపు – కొద్దిగా; మిరప కారం – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్‌; ధనియాల పొడి – ఒక టీ స్పూన్‌; గరం మసాలా – అర టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – పావు కప్పు; పెరుగు – 2 టేబుల్‌ స్పూన్లు.


బెండకాయ మసాలా కర్రీ తయారీ విధానం :


ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తడి పోయే వరకు ఆరబెట్టాక పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి.స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, బెండకాయ ముక్కలు వేసి బాగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి.అదే బాణలిలో జీలకర్ర వేసి కొద్దిగా వేగాక ఉల్లి తరుగు వేసి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.పసుపు, మిరపకారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.టొమాటో తరుగు జత చేసి, బాగా కలిపి మెత్తబడేవరకు ఉడికించాలి.పెరుగు జత చేసి, కలియబెట్టి, కొద్దిసేపు మూత ఉంచాలి.బెండకాయ ముక్కలు జత చేసి, ముక్కలకు మసాలా పట్టే వరకు మీడియం మంట మీద ఉడికించి, కొద్దిగా నీళ్ళు జత చేసి మరి కాసేపు ఉడికించాలి.కొత్తిమీరతో అలంకరించి దింపేయాలి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: