రుచికరమైన ఈ చింతపండు చారు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay


చింతపండు చారు మన దక్షిణ భారతదేశ సాంప్రదాయ వంటకం. చాలా ఆరోగ్యకరమైన వంటకం. అరుగుదలకు చింతపండు చారు చాలా మంచిది... చాలా మందికి ఈ రెసిపీ గురించి తెలిసే ఉంటుంది. కన్నడ స్టైల్లో చేసే ఈ చారు రుచిగా ఉంటుంది. అయితే ఇది చెయ్యడానికి కొంచెం టైం పడుతుంది. ఇక అతి తక్కువ పదార్థాలతో అంతే త్వరగా.. ఈజీగా తయారయ్యే ఈ వంటకం గురించి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో ఇప్పుడు ఎలా చెయ్యాలో  తెలుసుకుందాం..
 
చింతపండు చారుకు కావాల్సిన పదార్ధాలు..
ప్రధానంగా కావాల్సిన  పదార్థం పది  ఎండు మిరపకాయలు, ప్రధాన వంటకానికి కావాల్సినవి ఒక  టీ స్పూన్ మెంతుల, రెండు టీ స్పూన్ జీలకర్ర, అవసరాన్ని బట్టి పసుపు, అవసరాన్ని బట్టి చింత పండు, రెండు  టేబుల్ స్పూన్ బెల్లం పొడి, ఒక  కోయబడినవి ఉల్లిపాయలు, అవసరాన్ని బట్టి ఉప్పు, అవసరాన్ని బట్టి నీళ్ళు,
టెంపరింగ్ కోసం...3 టేబుల్ స్పూన్ రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె, అవసరాన్ని బట్టి కరివేపాకు, ఒక టీ స్పూన్ ఆవాల విత్తనాలు
చింతపండు చారు తయారు చేయవలసిన విధానం..
ముందుగా ఓ పాన్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. ఎండు మిరపకాయలు బాగా వేగితేనే త్వరగా మెత్తని పొడిలా మారతాయి కాబట్టి బాగా వేయించండి. ఇప్పుడు అందులో జీలకర్ర, మెంతులను వేసి నిమిషం పాటు వేయించండి. వీటన్నింటినీ మొత్తని పేస్టులా మిక్సీ పట్టండి..ఇప్పుడు మరో పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయండి. నూనె వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, పసుపు వేయండి. ఇప్పుడు ఆ పోపులోనే కరివేపాకులు వేసి స్టౌ ఆపేయండి.

ఇప్పుడు ఓ కప్పులో చింతపండు గుజ్జుని తీసుకోండి. అందులోనే బెల్లంని కలపండి. ఆ మిశ్రమంలోనే ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి కావాల్సినన్నీ నీరు పోసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి ఈ రసంలో వేసి బాగా కలపండి. అదే విధంగా పోపు మిశ్రమాన్ని కూడా వేసి కలపండి. ఇలా తయారైన రసం వేడి వేడి అన్నం లేదా రాగి ముద్దకి పర్ఫెక్ట్ కాంబినేషన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: