దగ్గు, జలుబును దూరం చేసుకోవడానికి ఈ మిరియాల రసం త్రాగండి.

Purushottham Vinay
చాలా మంది దగ్గు, జలుబు సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యకు అనేక రకాల మెడిసిన్స్ వాడిన కాని వారికి తాత్కాలికంగా మాత్రమే ఫలితం ఉంటుంది తప్ప శాశ్వతంగా ఉండదు. కాబట్టి దగ్గు, జలుబు లకు శాశ్వత మార్గం మిరియాల రసం. ఇది దక్షిణ భారత దేశంలో ఒక మంచి ఆరోగ్యకరమైన వంటకం. జలుబు, దగ్గు‌ వంటి సమస్యలకు ఇది సరైన పరిహారంగా వాడుకలో ఉన్న ఉత్తమమైన వంటకం ఈ మిరియాల రసం. దీనిని వాడుక భాషలో మిరియాల చారుగా కూడా వ్యవహరిస్తారు. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ మిరియాల రసం రెసిపీ లేదా పెప్పర్ రసం రెసిపీని సులభంగా, త్వరగా తయారుచేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం...

మిరియాల రసానికి కావాల్సిన పదార్ధాలు..

2 టేబుల్ స్పూన్ మిరియాలు
1 కప్ తురిమిన టెంకాయ
ప్రధాన వంటకానికి
2 టేబుల్ స్పూన్ మినపప్పు
2 ఎండు మిర్చి
అవసరాన్ని బట్టి ఉప్పు
అవసరాన్ని బట్టి నీళ్ళు
టెంపరింగ్ కోసం
2 టేబుల్ స్పూన్ నెయ్యి
1/2 టీ స్పూన్ ఆవాల విత్తనాలు
అవసరాన్ని బట్టి కరివేపాకు

ఒక బాణలిలో నెయ్యి వేసి, కొద్దిగా వేడయ్యాక అందులో మిరియాలు, మినపప్పు వేసి, మినపప్పు గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.అదే బాణలిలో కొంచెం నెయ్యి, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి వేయించాలి.మిక్సర్‌లో వేయించిన పదార్థాలన్నింటిని వేసి పేస్ట్‌ గా‌ వచ్చేవరకు మిక్సీ వేయండి. ఈ పేస్ట్ సిద్ధమైన తర్వాత, మనం ఇంతకు ముందు వేసిన పోపు ఈ రసంలో కలపండి. అందులో నీళ్ళు పోసి ఉడకనివ్వండి.రసం ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కలపండి. ఇప్పుడు దీన్ని వేడి అన్నంలో నెయ్యితో సర్వ్ చేయాలి. ఈ రెసిపీ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. జలుబు జ్వరం వంటి సమస్యలతో ఉన్నవారికి ఉపశమనం కోసం వినియోగించదగిన ఉత్తమమైన వంటకంగా సూచించబడుతుంది. ఇక్కడ నీళ్లకు బదులుగా‌ వడకట్టిన చింతపండు, నిమ్మరసం కలిపిన నీటిని జోడించవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: