మునక్కాయ చేపల కూర చాలా ఈజీగా...!

Sahithya
చాలా మందికి నాన్ వెజ్ లో కొన్ని రకాలు చేసుకోవడం రాదు. అందులో ప్రధానంగా చేపల కూరలో రకాలు అసలు తెలియదు. కాబట్టి ఇప్పుడు మీకు కొరమీను చేపల కూర చెప్తాను. అసలు దానికి కావాల్సినవి ఏంటీ అంటే... కొరమీను చేప ముక్కలు – అర కేజీ; కారం – నాలుగు టీ స్పూన్లు; ధనియాల పొడి – రెండు టీ స్పూన్లు; చింత పండు గుజ్జు – అర కప్పు; కొబ్బరి పేస్ట్‌ – అర కప్పు; పచ్చిమిర్చి – 10 కాస్త దంచండి. మునక్కాయలు – 2 (చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి). నూనె – అర కప్పు, జీలకర్ర పొడి – టీ స్పూన్‌; ఎండు మిర్చి – 5, కరివేపాకు – రెమ్మ; పసుపు – అర టీ స్పూన్‌; ఉప్పు – తగినంత వేయండి.
చేపముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని... స్టౌ మీద పాన్‌ పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక అందులో కొబ్బరి పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కారం, పసుపు తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించండి. తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టండి. ఈ మిశ్రమం కాస్త చిక్క పడిన తర్వాత అందులో కట్‌ చేసిన మునక్కాయ ముక్కలు, చింతపండు గుజ్జు పోసి సన్నటి సెగ మీద ఉంచండి. ఇది కొంచెం ఉడుకుతూ ఉండంగా మధ్యలో చేప ముక్కలను కూడా జత చేసి పెట్టండి.
ఈ మిశ్రమమంతా చిక్కబడుతుండగా దించి వేరొక పాన్‌ లో మిగిలిన నూనె వేసుకోండి. అది కూడా వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర పొడి, కరివేపాకు, ఎండు మిర్చి వేసి తాలింపు పెట్టండి. వేయించిన తాలింపును ఉడికించిన కూరలో కలిపి గిన్నెలోకి తీసుకోండి. అంతే నోరు ఊరించే మునక్కాయ చేపల కూర రెడీ అయినట్టే. చాలా సింపుల్ గా ఏ హడావుడి లేకుండా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: