చికెన్ వింగ్స్ చాలా ఈజీగా...!

Sahithya
మనకు ఓపిక ఉండాలే గాని చికెన్ తో చాలా రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. నాన్ వెజ్ అనగానే చాలా మందికి చికెన్ మాత్రమే కనపడుతూ ఉంటుంది. బిర్యానీ నుంచి స్నాక్స్ వరకు ఎన్నో ఎన్నో చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చికెన్ వింగ్స్ ఎలా చేసుకోవచ్చో చెప్తాను. చికెన్‌ వింగ్స్‌ - అర కిలో కావాలి. ఉల్లిపాయలు - రెండు, టొమాటోలు - మూడు, క్యాప్సికం - ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీ స్పూన్‌ కావాలి. పసుపు - ఒక టీ స్పూన్‌, కారం - ఒక టీ స్పూన్‌, ధనియాల పొడి - ఒకటిన్నర టీ స్పూన్‌ కావాలి.
జీలకర్ర - ఒకటిన్నర టీ స్పూన్‌, ఎండు మిర్చి - మూడు, జీలకర్ర పొడి - అర టీ స్పూన్‌, నిమ్మ రసం - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత వేసుకోండి. నూనె – సరిపడా వేయండి.
అసలు తయారి విధానం ఎలా అంటే... పాన్‌ లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్‌ వింగ్స్‌ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి నెమ్మదిగా కలపండి. వింగ్స్‌ ఫ్రై అవుతున్న సమయంలో కావాలంటే మరి కొద్దిగా నూనె పోయండి. అలాగే మసాలా తయారీ కోసం మరొక పాన్‌ లో నూనె వేసి ఎండు మిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి వేయించండి. అలాగే ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్‌ వింగ్స్‌ వేసి కలపండి. అప్పుడు ఉల్లిపాయలు వేసి మరికాసేపు వేయించండి. టొమాటో ముక్కలు వేయండి... ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు వేసి... నిమ్మ రసం, కొద్దిగా నీళ్లు పోసి మరికాసేపు ఉడికించండి. ఆ తర్వాత చివర్లో కాస్త కొత్తిమీర వేసి దించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: