చికెన్ రోస్ట్ ఎలా అంటే... ఇలా...!

Sahithya
చికెన్ తో చాలా వంటలు మనం తయారు చేసుకోవచ్చు. అయితే చాలా మందికి ఏ విధంగా చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు మనం చికెన్ రోస్ట్ ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. కావాల్సినవి ఏంటీ అంటే చికెన్‌ - ఒక కేజీ తెచ్చుకోండి. ఉల్లిపాయలు – రెండు చాలు. ఎండు మిర్చి – పది, ధనియాలు - రెండు టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు – నాలుగైదు ఉండాలి. జీలకర్ర – టీ స్పూన్‌, పసుపు – టీ స్పూన్‌,  నూనె – సరిపడా వేయండి. సాజీర - అర టీ స్పూన్‌ చాలు. లవంగాలు - ఆరు, దాల్చిన చెక్క - కొద్దిగా, యాలకులు – నాలుగు లేదా అయిదు.

మిరియాలు - టీస్పూన్‌, నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు – కొద్దిగా చాలు, కొత్తిమీర – ఒక కట్ట వేయండి. ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. స్టవ్‌ పై పాన్‌ పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయిన తర్వాత... తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పసుపు వేసి కలపండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్‌ వేసి కలపండి. మూత పెట్టి చిన్నమంటపై ఉడికించండి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేయించండి. అన్నీ వేగిన తరువాత మిరియాలు వేసి... సాజీర, లవంగాలు, దాల్చిన చెక్క వేసి యాలకులు వేసి కొంచెం ఆగిన తర్వాత పదార్థాలను, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి పొడి చేసుకోవాల్సి ఉంటుంది.

ఉడుకుతున్న చికెన్‌లో ఈ మసాలా వేయండి... తగినంత ఉప్పు వేసి కలపండి. నీళ్ళు అసలు పోయవద్దు. మూత పెట్టి చిన్నమంటపై పది నిమిషాల పాటు ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మంచి రంగు కోసం ఫుడ్‌ కలర్‌ కూడా వేయవచ్చు. చివరిగా కరివేపాకు వేసుకోండి బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: