మేక తలకాయ కూర ఎలా అంటే...!

Sahithya
మేక తలకాయ మాంసం కొందరికి ఇష్టంగా ఉంటే మరి కొందరికి కష్టంగా ఉంటుంది. చాలా మందికి అసలు దాని పేరు కూడా ఇబ్బందిగా ఉంటే మరి కొంత మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అసలు దానిని చాలా మందికి వండటం రాదు. ఎలా వండాలి ఏంటీ అనేది ఒకసారి చూడండి...

మేక తలకాయ మాంసం ఒక కేజీ తీసుకుని... రెండు ఉల్లిపాయలు, నాలుగు టీ స్పూన్ కారం తీసుకోవాలి. అలాగే కొబ్బరి పొడి - మూడు టీ స్పూన్లు, ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు, పచ్చి మిర్చి - రెండు, వెల్లుల్లి రెబ్బలు – ఆరు  పసుపు - ఒక టీ స్పూన్‌, జీలకర్ర - అర టీ స్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూన్‌, లవంగాలు - ఎనిమిది, సాజీర - అర టీ స్పూన్‌, మిరియాలు – అర టీస్పూన్‌, దాల్చిన చెక్క - కొద్దిగా, యాలకులు - నాలుగు, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత తీసుకోవాలి.

 తయారీ ఎలా   అంటే... ముందుగా మసాలా తయారు చేసుకుని రెడీ గా ఉంచుకోవాలి. మిక్సీలో కొద్దిగా ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాల పొడి, కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, దాల్చినచెక్క, లవంగాలు, సాజీర వేసి మెత్తగా పేస్టులా చేసుకోండి. కుక్కర్‌ పెట్టి నూనె వేసి వేడి అయిన తర్వాతనే ఉల్లిపాయలు మిగిలినవి వేయండి.

కాసేపు వేగిన తరువాత పచ్చి మిర్చి వేసుకోండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపండి. ఇప్పుడు తలకాయ మాంసం వేసి మూత పెట్టి చిన్నమంటపై పది నిమిషాలు ఉడికించిన తర్వాత... తయారు చేసి రెడీగా పెట్టుకున్న మసాలా పేస్టు వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉంచండి. తగినంత కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి... తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి చాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: