హెరాల్డ్ స్పెషల్ కర్రీ : ఎంతో రుచికరమైన ములక్కాయ మటన్ కర్రీ మీ కోసం.. !!

Suma Kallamadi

 

మాంసాహార ప్రియులకు మటన్ అంటే కూడా చాలా ఇష్టం. మటన్ తో కూడా చాలా రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. రోజూ ఒకేలా వండితే తినేవారికి   విసుగుపుడుతోంది. అందుకే ఈ రెసిపీ ఖచ్చితంగా మీకోసమే .ములక్కాయతో కలిపి మటన్ వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తింటే అసలు వదలరు. ఇప్పుడు ములక్కాయ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..!


కావలిసిన పదార్ధాలు :

1)మటన్: ఒక కేజీ

2)ములక్కాయలు: 4 పెద్దవి 

3)టమాటాలు: 2

4)ఉల్లిపాయ: 2

5)కరివేపాకు: 2రెబ్బలు

6)అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 స్పూన్స్

7)పసుపు: ఒక స్పూన్

8)కారం: 2 స్పూన్స్

9)కొబ్బరి : అర ముక్క

10)దాల్చిన చెక్కా, లవంగం పొడి: 1స్పూన్

11)యాలకులపొడి: 1 స్పూన్

12)ఉప్పు: తగినంత

13)గరం మసాలా పొడి: 1 tsp

14)నూనె: సరిపడా
  
15)కొత్తిమీర -కొద్దిగా 

16)పచ్చిమిరపకాయలు -2

 

తయారీ విధానం :

 

ముందుగా ములక్కాయలను  కావలసిన సైజు లో  ముక్కలుగా కట్ చేసుకుని  పెట్టుకోవాలి.కొంచెం పెద్ద సైజ్ ములక్కాయ అయితే కూర బాగా రుచిగా ఉంటుంది.   తరువాత  స్టవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టాలి. అందులో నూనె  వేయాలి. నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి  వేయించాలి. ఇప్పుడు కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత కారం పొడి, కొబ్బరి పేస్ట్, దాల్చిన  చెక్కా లవంగం, యాలకులపొడి వేసి కలపాలి.  తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలను వేసి కొద్దిగా మగ్గిన  తరువాత  ఉప్పు , కారం వేసి బాగా వేగనివ్వాలి.

 

 

 

ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కలు, ములక్కాయ  ముక్కలు కూడా వేసి మెత్తబడేవరకు వేయించి సరిపడా నీళ్లు పోసి కలిపి మూతపెట్టి  15 నిమిషాలు ఉడికించాలి. గరిటతో తిప్పకూడదు అలా తిప్పితే ములక్కాయ ముక్కలు విరిగిపోతాయి. అందుకనే బాగా కూరని తిప్పకూడదు. నీళ్లు పొసే ముందు మాత్రమే ములక్కాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు మూత తీసి గరం మసాలా కలిపి రెండు నిముషాలు ఉంచి, కొత్తిమీర జల్లి  స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి  తీసుకుని రైస్ తో సర్వ్ చేసుకోవాలి..అంతే ఎంతో రుచికరమైన మటన్ ములక్కాయ కూర రెడీ. అతిధులను ఆహ్వానించండి.. మీరు చేసిన కూర వడ్డించి ప్రశంసలు పొందండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: