హెరాల్డ్ స్పెషల్ కర్రీ : ఘాటెక్కించే పెప్పర్ చికెన్ ఫ్రై తయారీ మీకోసం ...!

Suma Kallamadi

 

మామూలు చికెన్ కూర తినీ తినీ బోర్ కొట్టినపుడు ఒకసారి ఇలా పెప్పర్ తో చికెన్ వండుకుంటే బాగుంటుంది.ఎండుమిర్చి, మిరియాలు రెండు కారంగా ఉన్నా వాటి రుచిలో తేడా ఉంటుంది.మిర్చి ఘాటు వేరు, మిరియాల ఘాటు వేరు.అలాగే  మిరియాలలో సహజంగా మాంసాన్ని మెత్తబరచే గుణం కలదు.అంతే కాకుండా అది సహజంగా మాంసాహారం లో ఉండే నీచు వాసనను తొలగించి చక్కని సున్నితమైన రుచిని, పరిమళాన్ని ఇస్తుంది.

 

మారినేషన్ కొరకు కావలిసినవి :

500 గ్రాములు చికెన్
 కొంచెం   పసుపు
1 tsp ఉప్పు
1 tbsp మిరియాల పొడి
   కప్పు పెరుగు
1 tsp అల్లం వెల్లులి పేస్ట్
2 రెమ్మలు కరివేపాకు

మసాలా కొరకు:

2 tbsp ధనియాలు
3 లవంగాలు
2 యాలుకలు
1 అంగుళం దాల్చినచెక్క
1 చిన్న ముక్క అనాస పువ్వు
1 tspసోంపు
1 tsp గసగసాలు
1 tsp ఎండు కొబ్బరి పొడి

 

కూర కొరకు కావలిసిన పదార్ధాలు :

2 మీడియం ఉల్లిపాయలు పేస్ట్
4 పచ్చిమిరపకాయలు
1 tbsp అల్లం వెల్లుల్లి ముద్ద
1 tbsp మసాలా
2-3 tsp మిరియాల పొడి
1 రెమ్మ కరివేపాకు
10 జీడిపప్పులు దోరగా వేయించినవి
   కొత్తిమీర కొంచం 
  1/4  కప్పు నూనె

చికెన్ ని మారినేట్ చేయుట:


శుభ్రంగా కడిగిన చికెన్ ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మిరియాల పొడి, కరివేపాకు వేసి బాగా కలిపి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.మసాలా తయారు చేయుటఒక చిన్న పెనం వేడి చేసి అందులో ధనియాలు, లవంగాలు, యాలుకలు, అనాస పువ్వు, దాల్చినచెక్క, సోంపు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.తర్వాత గసగసాలు, ఎండు  కొబ్బరి పొడి కూడా వేసి 15 సెకన్ల పాటు వేయించాలి.వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

 కూర తయారు చేయుట:

 

ఒక బాణలిలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయల పేస్ట్ వేసి 2 నుండి 3 నిమిషాల పాటు వేయించాలి.తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కుడా వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.నానబెట్టిన చికెన్ ని వేసి ఒకసారి బాగా కలియ తిప్పి, మూత పెట్టి మాదిరి సెగ మీద 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించాలి.మూత తెరిచి ఒకసారి కూరని కలిపి, 1 టేబుల్ స్పూన్  ముందుగా చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఇంకా 2 నుండి 3 tsp ల మిరియాల పొడి వేసి మళ్ళీ కలిపి 5 నుండి 7 నిమిషాలు ఉడికించాలి.తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు ఉడికించి స్టౌ కట్టేయాలి.
 మారినేషన్ లో 1 tbsp మిరియాల పొడి, ఇంకా కూర వండేటప్పుడు 3 tsp ల మిరియాల పొడి వేసాను.కానీ పిల్లలు మనం తిన్నంత కారం తినలేరు కాబట్టి కాస్త తగ్గించి వేసుకుంటేనే మంచింది.అందుకే ముందుగానే నేను చెప్పినంత వేసేయకుండా మీ రుచికి సరిపడా వేయండి.కూర దించే ముందు కొద్దిగా నిమ్మ రసం పిండితే ఇంకా బాగుంటుంది.ఈ కూరని అన్నం ఇంకా చారు తో కలిపి వడ్డిస్తే చాలా బాగుంటుంది.లేదా చపాతీలు, నాన్ ల తో కూడా తినవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: