వంటా వార్పు: ఇంట్లోనే సులువుగా య‌మ్మీ య‌మ్మీ `జాంగ్రీ`ని త‌యారు చేసుకోండిలా..!!

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
మినప్పప్పు- ఒక‌ కప్పు 
మంచినీళ్లు- అక‌ కప్పు
నూనె- వేయించ‌డానికి స‌రిప‌డా

 

ఆరెంజ్‌ కలర్- ఒక టీ స్పూన్ 
పంచదార- రెండు కప్పులు 
యాలకుల పొడి- అర టీ స్పూన్ 
వంట సోడా- చిటికెడు

 

త‌యారీ విధానం: 
ముందుగా మినప్పప్పుని రాత్రంతా నానబెట్టి రుబ్బుకోవాలి. ఒక‌వేళ పిండిని మిక్సీలో రుబ్బితే  చేత్తో బాగా గిలకొట్టాలి. తరవాత అందులో ఆరెంజ్ రంగు, వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని క‌నీసం మూడు గంటలు పులియనివ్వాలి. వాతావరణం చల్లగా ఉంటే ఆరు గంటలు పులియనివ్వాలి. మ‌రోవైపు స్టవ్ మీద పాన్ పెట్టి పంచదార వేసి నీళ్లు పోసి పలుచని తీగపాకం రానివ్వాలి. 

 

తరవాత యాలకుల పొడి వేసి ఉంచాలి. తర్వాత మరో పాన్ పెట్టి బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి. ఇప్పుడు రంధ్రం ఉన్న ప్లాస్టిక్‌ బాటిల్ లేదా క్లాత్‌లో పిండి మిశ్రమం వేసి జాంగ్రీల్లా చుట్టి తక్కువ మంట మీద వేయించి తీసి పాకంలో ముంచి నాలుగైదు నిమిషాలు ఉంచి తీయాలి. అంతే య‌మ్మీ య‌మ్మీ జాంగ్రీ రెడీ అయినట్లే. 

 

సాధార‌ణంగా జాంగ్రీ అంటే చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. కానీ, దీన్ని ఎలా చేయాలో చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. ఎక్క‌డైనా భోజ‌నాల్లో పెడితే.. లేదా స్వీ‌ట్ షాపుల్లో కొనుగోలు చేస్తే త‌ప్పా జాంగ్రీ తిన‌లేము అని అనుకోవ‌చ్చు. కానీ, పైన చెప్పిన సింపుల్ టిప్స్‌ను ఫాలో అవుతూ య‌మ్మీ య‌మ్మీ జాంగ్రీని త‌యారు చేసుకోండిలా. పిల్ల‌లు కూడా జాంగ్రీని ఎంతో ఇష్టంగా తింటారు. 

 

మ‌రోవైపు.. ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా కార‌ణంగా ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఈ టైమ్‌లో ఇలాంటి వంట‌కాల‌ను ట్రై చేసి.. ఎంజాయ్ చేయండి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: