వంటా వార్పు: ఎంతో రుచిక‌ర‌మైన `క్యాబేజీ పచ్చడి` ఎలా చేయాలో తెలుసా..?

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు: 
క్యాబేజీ తురుము- ఒక కప్పు
జీలకర్ర- అర టీస్పూన్‌
మినప్పప్పు- ఒక‌ టేబుల్‌ స్పూన్‌
శనగపప్పు- ఒక‌ టేబుల్‌ స్పూన్‌

 

పచ్చిమిర్చి- ఐదు
ఎండుమిర్చి- నాలుగు
చింతపండు పులుసు- పావు కప్పు
నూనె- త‌గినంత‌
ఉప్పు- రుచికి స‌రిప‌డా


 
ఆవాలు- అర టీ స్పూన్‌
ఇంగువ- చిటికెడు
పసుపు- పావు టీ స్పూన్‌

 

త‌యారీ విధానం: ముందుగా ఒక పాన్‌లో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, క్యాబేజీ తురుము వేసి బాగా వేగించాలి. 

 

క్యాబేజీ సగం ఉడికిన తర్వాత దింపేసి చింతపండు పులుసు పోసి మెత్తగా మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మానికి పోపు పెట్టుకుంటే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ క్యాబేజీ పచ్చడి రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: