హెల్తీ బ్రేక్ ఫాస్ట్.క్యారెట్ పూరీ ఎలా చేయాలంటే ?

venugopal Ramagiri
క్యారెట్ చేసే మేలు గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఈ క్యారెట్ వల్ల ఎన్ని లాభాలో మనం నిత్యం వింటూనే ఉంటాం, ఇక డైటింగ్ చేసేవాళ్ళు ప్రతిరోజు క్యారెట్ జ్యుస్ తాగితే మంచిదంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఈ జ్యుస్ తో చర్మం పై ముడతలు రావు. అంతేకాకుండా, క్యారెట్‌తో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. హైబీపీ తగ్గుతుంది. రక్తం ఉత్పత్తి అవుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. క్యారెట్ అంతర్గతంగానే కాకుండా పై పూతగాను బాగా పని చేస్తుంది. ఇకపోతే రోజుకో క్యారెట్ తినాలని వైద్యులు చెబుతారు. దాన్ని తినడానికి ఇష్టపడని వారు.సెపరేట్‌గా తినకుండా రోజూ తినే ఆహారంతో తీసుకుంటే సరిపోతుంది. అది బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే ఇంకా మంచిది. అందుకే  వెరైటిగా క్యారెట్ పూరీలు చేసుకుందాం.


క్యారెట్ పూరీలకు కావలసినవి :
గోధుమపిండి : కప్పు
క్యారెట్ రసం : పావుకప్పు
బొంబాయి రవ్వ : రెండు చెంచాలు
నూనె : తగినంత
ఉప్పు : తగినంత.


విధానం తయారీ :
ముందుగా వెడల్పాటి బౌల్‌లో గోధుమపిండి, బొంబాయి రవ్వ, ఉప్పు తీసుకోవాలి. క్యారెట్ రసం, నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపాలి. పావుగంట తర్వాత స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పిండిని పూరీల్లా ఒత్తుకొని రెండేసి చొప్పున నూనెలో వేయించుకొని తీసుకోవాలి. అంతే క్యారెట్ పూరీ తయారయినట్లే. ఈ పూరీలను ఆలూకర్రీ గ్రేవీతో తింటే టేస్టీగా ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: