నోరూరించే చికెన్ ఫ్రైడ్ పీస్ కర్రీ తింటే వావ్ అనవలసిందే !

venugopal Ramagiri
చికెన్ అంటే ఇష్టపడవి వారు దాదాపుగా లేరనే చెప్పవచ్చూ. చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తినేది చికెన్ లెగ్ పీసెస్.ఇక శాకాహారులు,సాధారణంగా నాన్ వెజిటేరియన్ వంటలను రుచి చూడాలంటే మొదటి చికెన్ తో మొదలు పెడుతారు.చికెన్ తినడం వల్ల ఆరోగ్యం కూడా. చికెన్ వండే విధానం మీదే కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆధారపడి ఉంది. ఫ్రైడ్ చికెన్ లో కంటే ఉడికించిన చికెన్ లో చాలా రకలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.చికెన్ తయారు చేయడమే కాదు, దాన్ని తీసుకురావడంలో కూడా జాగ్రత్తలు వహించాలి. తాజా చికెన్ మాత్రమే కొనుగోలు చేయాలి. అప్పుడే ఆరోగ్యానికి మంచిది. నిల్వ చేసిన చికెన్ ఘనీభవించి ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.ఇక ఇప్పుడు వావ్ అనిపించే చికెన్ ఫ్రైడ్ పీస్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం..


కావలసిన పదార్ధాలు::
చికెన్ లెగ్ పీసెస్ 4..ఉప్పు, కారంరుచికి సరిపడ..పసుపు 1/2 స్పూన్.. ఉల్లిపాయలు 3...పచ్చిమిర్చి 2...టమాటాలు 1...కొత్తిమీర తరుగు కొంచం..షాజీర 1 స్పూన్..జీర 1 స్పూన్... కరివేపాకు 2 రెమ్మలు.. నిమ్మకాయ రసం 2స్పూన్స్... అల్లం వెల్లుల్లి ముద్ద 2స్పూన్స్.. గట్టిపెరుగు 3స్పూన్స్.. ధనియాలపొడి  2 స్పూన్స్.. జీలకర్రపొడి 1/2స్పూన్..గరం మసాల పొడి 2 స్పూన్.. రెడ్ కలర్ చిటికెడు.. నూనెడీప్ ఫ్రైకి సరిపడ..


తయరీ విధానం..
చికెన్ లెగ్ పీసెస్ బాగా కడిగి చాకుతో వాటికి చిన్నచిన్న గాట్లు పెట్టుకోవాలి. ఒక బౌల్ లో రుచికి సరిపడ ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం వేసి కలిపి దానిని చికెన్ లెగ్ పీసెస్కి బాగా పట్టించి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇంకో బౌల్ లో కొంచం అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర పొడి,కొంచం ధనియాలపొడి, కొంచం గరం మసాలపొడి, కొంచం గట్టిగా ఉన్న పెరుగు, ఇష్టమైన వాళ్ళు రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు, ఒక స్పూన్ నూనె వేసి కలిపి, అందులో కొంచం ఉప్పు,కారం వేసిన చికెన్ లెగ్ పీసెస్ ను వేసి మసాలా బాగా పట్టించి మినిమం 2గంటలు ఫ్రిజ్ లో పెట్టాలి.


స్టౌ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసి కాగాక ఫ్రిజ్ ఉంచిన చికెన్ లెగ్ పీసెస్ ను ఫ్రై చేసుకుని, పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచం నూనె ఉంచి అందులో జీర, షాజీర వేసి వేయించాలి. వేగాకా అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి కొంచం పసుపు చేర్చి బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి. వాసన పోయాక అందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి అవి బాగా మెత్తబడి నూనె బయటకు వచ్చెవరకు మగ్గించాలి.


అవి మగ్గాక అందులో గ్రేవీకి సరిపడ ఉప్పు, కారం, ధనియాలపొడి, గరం మసాలపొడి వేసి కలిపి అందులో కొంచం బీట్ చేసిన పెరుగు, కొంచం నీళ్ళు వేసి ఉడకనివ్వాలి. ఉడికే గ్రేవీలో వేయించి ఉంచుకున్న ఫ్రైడ్ చికెన్ పీసెస్ వేసి కలిపి కొత్తిమీర తరుగు వేసి కలిపి మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గించి దించాలి. ఇప్పుడు వావ్ అనిపించే చికెన్ ఫ్రైడ్ పీస్ కర్రీ రెడి.ఇక తినడమే ఆలస్యం చాలా రుచుగా ఉండి ఆరోగ్యానికి తగిన పోషకాలను అందిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: