మైసూర్ మహరాజులా వుండే మైసూర్ చార్..

venugopal Ramagiri
చారు అనగానే నీటిలో లాలజలాలు ఊరుతాయి.ఎందుకంటే ఈ చారును ఏ కూరలోనైనా కలుపుకుని తినవచ్చూ.ఇక వేడి వేడి అన్నంలో,వేడి వేడి చారు కలుపుకుని అంచుకు ఏదైన ఫ్రై కర్రి పెట్టుకుని తింటే అబ్బా అంటూ లొట్టలేసుకుంటు తినే ఆరుచికి నోటిలోని నాలుక నాలుగు ముద్దలు ఎక్కువే తిను అని గోల చేయదా..అలాంటి రుచికలిగే మైసూర్‌ చారు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.



చారు పొడి కోసం కావలసిన సరకులు: 
నెయ్యి–2 టీ స్పూన్లు...ధనియాలు–ఒక టేబుల్‌ స్పూను...పచ్చి శనగ పప్పు–ఒక టీ స్పూను...జీలకర్ర–అర టీ స్పూను... మిరియాలు–అర టీ స్పూను...మెంతులు-అర టీ స్పూను...ఎండు మిర్చి–2...కరివేపాకు–రెండు రెమ్మలు...ఇంగువ–పావు టీ స్పూను...పచ్చి కొబ్బరి తురుము–పావు కప్పు ఉడికించడానికి కందిపప్పు–అరకప్పు...పసుపు–పావుటీ స్పూను...నీళ్లు–ఒకటిన్నర కప్పులు...గుజ్జు కోసం చింతపండు–నిమ్మకాయంత...వేడి నీళ్లు–అర కప్పు...పసుపు–పావు టీ స్పూను... టమాటా– 1...నీళ్లు–2 కప్పులు...ఉప్పు–తగినంత...పోపు కోసం నెయ్యి–అర టీ స్పూను...ఆవాలు–అర టీ స్పూను...కరివేపాకు–రెండు రెమ్మలు... ఇంగువ–కొద్దిగా... కొత్తిమీర తరుగు–ఒక టేబుల్‌ స్పూను...



తయారీ విధానం::
ముందుగా కందిపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాక,తగినన్ని నీళ్లు జత చేసి కుక్కర్‌ లో ఉంచి ఏడెనిమిది విజిల్స్‌ వచ్చాక దింపేయాలి.కొద్దిసేపయ్యాక మూత తీసి పప్పును మెత్తగా మెదపాలి.చింతపండును వేడినీళ్లలో సుమారు అర గంట సేపు నానబెట్టాక,చిక్కగా రసంతీసి పక్కన ఉంచాలి.స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యివేసి అందులో పచ్చి శనగపప్పు వేయించాలి.ధనియాలు,జీలకర్ర,మెంతులు,మిరియాలు,ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాక ఇంగువ,కరివేపాకు వేసి పదార్థాలన్నీ దోరగా వేగేవరకు కలపాలి..పచ్చి కొబ్బరి తురుము జత చేసి మరోమారు బాగా వేయించి,దింపేయాలి..



బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి.ఒక పాత్రలో చింతపండు రసం,రెండు కప్పుల నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి.తరిగిన టమాటాలు జతచేసి. పసుపు వేసి బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టాలి..టమాటాలు బాగా మెత్త పడ్డాక,మైసూర్‌ మసాలా పొడి,తగినంత ఉప్పు వేసి కలియబెట్టి,మరిగించాలి..స్టౌ మీద చిన్న బాణలి వేడయ్యాక నెయ్యివేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి,కరివేపాకు,ఎండుమిర్చి ఇంగువ వేసి దోరగా వేయించి తీసేసి,మరుగుతున్న చారులో వేసి కలియబెట్టి దింపేయాలి.చివరగా కొత్తిమీర వేసి కలపాలి.ఇది వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: