450 రూపాయలకే గ్యాస్ సిలిండర్?

Suma Kallamadi
రక్షాబంధన్ కార్యక్రమం దగ్గర పడుతూ ఉండటంతో దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు మహిళలకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఎన్నికల మునుపే మోడీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వంటగ్యాస్ సిలిండర్ ధరలు క్రమేపి తగ్గిస్తూ వస్తున్నాయి. వంట గ్యాస్ అనేది నేటి మానవ జీవన శైలిలో అనివార్యం అయిపోయింది. దాంతోనే గ్యాస్ వినియోగం భారీగా పెరిగింది. అదే స్థాయిలో వాటి ధరలు కూడా పెరుగుతూ వచ్చాయి. అయితే ఆ ధరలు... పేద, మధ్యతరగతి వారికి పెను భారంగా మారాయి.
ఈ నేపథ్యంలోనే రానున్న రక్షాబంధన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర మహిళలకు వరాలజల్లును కురిపించింది. లాడ్లీ బహనా యోజన కార్యక్రమం కింద కేవలం 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. గత సంవత్సరం రక్షాబంధన్ కార్యక్రమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి వినియోగదారులందరికీ 33 కోట్ల కొత్త కనెక్షన్లు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు ముందుకు రావడంతో... వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వారు కూడా ముఖ్యంగా మహిళల పట్ల వరాలు కురిపించడం పరిపాటిగా మారింది. ఇక మన దగ్గర కూడా వంట గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 300 రూపాయలు తగ్గిన విషయం అందరికీ తెలిసిందే.. ఇక రక్షాబంధన్ కార్యక్రమం అంటే.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక వంటిది. ఇటువంటి కార్యక్రమాల సందర్భంగా... రాష్ట్ర, దేశ నాయకులు మహిళల విషయంలో సొంత అన్నలుగా వ్యవహరిస్తున్న తీరు నిజంగా అభినందనీయం అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.గ్యాస్ సిలిండర్ వాడకం అనేది రోజువారి కార్యక్రమంలో ఒక ప్రక్రియ అనే చెప్పాలి. ఇక మీ మీ ఏరియాలలో వంట గ్యాస్ సిలిండర్ ధర ఎంత మేర తగ్గిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: