రైల్వే టికెట్లు అలా బుక్ చేస్తున్నారా? ఇకనుండి అలా కుద‌ర‌దు!

Suma Kallamadi
టికెట్లు కావాలంటే ఒక‌ప్పుడు స్టేష‌న్ కు వెళ్లి గంటలు గంటలు క్యూలో నిలబడి తీసుకునే ప‌రిస్థితి ఉండేది. కానీ, నేడు పరిస్థితి మారింది. ఇప్పుడు ఇంట్లో కూర్చుని.. ఆన్‌లైన్‌లో టికెట్ల‌ను బుక్ చేసుకునే వెసులుబాటు కలదు. ముఖ్యంగా ఐఆర్ సీటీసీ వ్య‌వ‌స్థ ద్వారా.. మ‌న‌కు టికెట్లు బుకింగ్ స‌దుపాయం మ‌రింత ఈజీ అయింది. ఇదే క్రమంలో అనేక అక్ర‌మాలు, దోపిడీలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేప‌థ్యంలో తాజాగా రైల్వే టికెట్ల బుకింగ్‌పై ఆంక్ష‌లు విధిస్తూ.. కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. సాధారణంగా చాలా మంది ఐఆర్ సీటీసీలో లాగిన్ ఉంటుంది. దీంతో వారు ఎవ‌రికైనా టికెట్ల‌ను క్షణాల్లో బుక్ చేసేస్తూ ఉంటారు. కొంద‌రు ఫ్రెండ్స్ కోసం.. మ‌రికొంద‌రు బంధువుల‌ కోసం కూడా.. టికెట్లు బుక్ చేస్తారు.
అయితే.. ఈ క్ర‌మంలో అనేక మోసాలు జ‌రుగుతున్నాయ‌ని రైల్వే శాఖ గుర్తించింది. పైగా ప‌న్నులు కూడా వ‌సూలు కావ‌డం లేద‌ని తెలుసుకోవడంతో తాజా పరిణామాలు సంభవించాయి. అందుకని థ‌ర్డ్ పార్టీ అంటే.. ర‌క్త‌సంబంధీకులు కాని ఎవరైనా మిమ్మల్ని టికెట్లు బుక్ చేయమని అడిగితే ఇకనుండి మీరు చేయలేరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దానిపై నిషేధం విధించింది. కేవ‌లం రైల్వే శాఖ నుంచి లైసెన్సు తీసుకున్న ఏజెంటు ద్వారా మాత్ర‌మే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంద‌ని రైల్వే శాఖ స్ప‌ష్టం చేసింది. ఇలా కాకుండా.. ఎవ‌రికిబ‌డితే వారికి టికెట్లు బుక్ చేస్తే.. వాటిని ర‌ద్దు చేయ‌డంతోపాటు.. బుక్ చేసిన వారికి రూ.10 వేల జ‌రిమానా వేయడమే కాకుండా 3 సంవత్సరాలు జైలు ఏక‌కాలంలో విధిస్తామ‌ని రైల్వే శాఖ ప్ర‌క‌టించింది.
కాబట్టి ఈ విషయాన్ని సాధారణ ప్రజలు గుర్తించాల్సిందిగా సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీనివ‌ల్ల రైల్వే శాఖ‌కు ఆదాయంతోపాటు.. నిబంధ‌న‌ల ప్ర‌కారం టికెట్ల ప్ర‌క్రియ సాగుతుంద‌ని రైల్వే శాఖ అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా రైల్వే ప్లాట్‌ఫాం టికెట్లకు జీఎస్టీ మినహాయింపు నిస్తూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకున్నది. రైల్వే ప్లాట్‌ఫాం టికెట్లతో సామాన్యుడిపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు వీటిపై కౌన్సిల్‌ జీఎస్టీ మినహాయింపుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైల్వే స్టేష‌న్ల‌లో విశ్రాంతి గదులు, వేచివుండే గదులు, క్లాక్‌రూం ఫెసిలిటీ, బ్యాటరీతో నడిచే కార్లపై జీఎస్టీ మినహాయింపునిచ్చినట్టు నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: