RBI: 2 వేల నోట్ల విత్ డ్రాపై అదిరిపోయే న్యూస్?

Purushottham Vinay
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా ఒక చక్కటి తీపికబురుని అందించింది. రూ. 2 వేల నోట్ల  విత్ డ్రా అంశంపై కీలక ప్రకటనని చేసింది.ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ రూ. 2 వేల నోట్ల అంశంపై స్పందించడం జరిగింది. ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ మీద రూ. 2 వేల కరెన్సీ నోట్ల  ఉపసంహరణ వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని శక్తికాంత్ దాస్ వెల్లడించడం జరిగింది. ఇది నిజంగా ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.'ఒక్క విషయాన్ని అయితే నేను కచ్చితంగా చెప్పగలను. రూ. 2 వేల నోట్ల విత్ డ్రా నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం అనేది ఉండదు' అని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇక ఆర్‌బీఐ గత నెలలో రూ.2 వేల నోట్లను విత్ డ్రా చేసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో రూ. 2 వేల నోట్లు ఎవరి దగ్గరైన ఉంటే.. వాటిని వెంటనే ఈజీగా మార్చుకోవచ్చు. దీనికి సెప్టెంబర్ నెల చివరి దాకా అవకాశం ఉంటుంది.



ఇక దగ్గరిలోని బ్యాంక్‌కు వెళ్లి ప్రజలు వారి వల్ల ఉన్న రూ.2 వేల నోట్లను వేరే కరెన్సీ నోట్లతో మార్చుకోవచ్చు. లేదంటే వారి బ్యాంక్ అకౌంట్లలో ఈ రూ. 2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అందువల్ల మీ వద్ద రూ. 2 వేల నోట్లు కనుక ఉంటే.. వెంటనే ఎక్స్చేంజ్ చేసువచ్చు. లేదంటే డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే చాలా వరకు రూ. 2 వేల నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు వచ్చాయి.ఆర్‌బీఐ రూ. 2 వేల నోట్ల విత్ డ్రా నిర్ణయానికి ముందే వ్యవస్థలో ఈ కరెన్సీ నోట్ల చెలామణి బాగా తగ్గిపోయింది. ఇక ఏటీఎంలలో కూడా రూ. 2 వేల నోట్లు వచ్చేవి కాదు. కేవలం రూ. 500 నోట్లు మాత్రమే వచ్చేవి.ఇంకా అలాగే ప్రజల వద్ద కూడా చాలా తక్కువగా రూ. 2 వేల నోట్లు కనిపించేవి. అందువల్ల ఆర్‌బీఐ రూ. 2 వేల నోట్ల విత్ డ్రా నిర్ణయాన్ని ప్రకటించడం వల్ల ఎవరిపై కూడా ప్రతికూల ప్రభావం పడలేదు. ఇంకా అలాగే వీటిని మార్చుకోవడానికి చాలా గడువు కూడా ఇచ్చారు. దీని వల్ల ప్రజలపై  ఎలాంటి ప్రభావం లేదని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RBI

సంబంధిత వార్తలు: