ఇక దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ కస్టమర్లకు మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ‘SBI వీకేర్’ కాలాన్ని బ్యాంక్ ఎక్స్టెండ్ చేసింది.ఇప్పుడు ఈ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు తీసుకోవచ్చని తెలిపింది. కరోనా క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా.. స్టేట్ బ్యాంక్ ఈ పథకాన్ని ప్రారంభించింది. గతంలో కూడా ఈ పథకాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే దానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా మరోసారి పొడిగించాలని నిర్ణయించబడింది. sbi వీకేర్ స్కీమ్ సీనియర్ సిటిజన్ల కోసం రిటైల్ టర్మ్ డిపాజిట్ కింద అమలు చేస్తోంది. దీనిలో అదనంగా 30 బేసిస్ పాయింట్ల వడ్డీ చెల్లిస్తోంది ఎస్బీఐ.ఈ అదనపు వడ్డీ వచ్చేసి మొత్తం 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ మెచ్యూరిటీతో టర్మ్ డిపాజిట్ పథకాలపై చెల్లించబడుతుంది. మే 2020లో కోవిడ్ మహమ్మారి మొదటి వేవ్ సమయంలో స్టేట్ బ్యాంక్ “SBI WeCare FD” పథకాన్ని ప్రారంభించింది. సీనియర్ సిటిజన్లకు ఆర్థిక ప్రయోజనాలను అందించడానికి ఈ పథకం ప్రారంభించబడింది. ఈ పథకం మొదట సెప్టెంబరు 2020 వరకు మాత్రమే.. కానీ తర్వాత చాలా సార్లు పొడిగించబడింది ఎస్బీఐ. ఈ పథకం కింద 5 సంవత్సరాలు, ఈ స్కీంలో సీనియర్ సిటిజన్‌లకు అదనంగా 30 బేసిస్ పాయింట్ల వడ్డీ ఇవ్వబడుతుంది.సీనియర్ సిటిజన్లు వీకేర్ స్పెషల్ ఎఫ్‌డి స్కీమ్‌లో అదే కాలానికి డబ్బు పెట్టుబడి పెడితే.. వారికి 6.45 శాతం వడ్డీ లభిస్తుంది.
కొత్త రేట్లు ప్రకారం జనవరి 8, 2021 నుంచి ఇది వర్తిస్తుంది. కరోనా సమయంలో సీనియర్ సిటిజన్ కస్టమర్‌లు తమ డిపాజిట్లపై మంచి రాబడి కోసం Wecare FD పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టారు. దాని డిమాండ్, ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని.. స్టేట్ బ్యాంక్ తన జీవితాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలని నిర్ణయించింది.76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఉత్సవ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక పథకం 15 ఆగస్టు 2022 నుండి 28 అక్టోబర్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ FD స్కీమ్‌లో పెట్టుబడి పెడితే.. కస్టమర్‌లు 6.1 శాతం వడ్డీని పొందుతున్నారు.సీనియర్ సిటిజన్లు, ఎస్‌బిఐ సిబ్బంది. పెన్షనర్‌లకు సాధారణ ప్రజల కంటే ఎక్కువ వడ్డీని ఇస్తున్నారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం FD పథకంపై 2.90 శాతం నుంచి 5.65 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. ఇందులో, FD మెచ్యూరిటీ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే మెచ్యూరిటీ కోసం sbi సీనియర్ సిటిజన్లకు 3.40 శాతం నుంచి 6.45 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. ఇటీవలి రెపో రేటు పెంపు తర్వాత దాదాపు అన్ని బ్యాంకులు FD రేట్లను పెంచుతున్నాయి.