రోజుకి 18 గంటల పని.. సీఈఓపై నెటిజన్లు ఆగ్రహం?

Purushottham Vinay
సాధారణంగా ఏ కంపెనీ అయిన తమ ఉద్యోగులు 8 నుంచి 12 గంటలు పని చెయ్యాలని రూల్ పెడుతుంది. ఒక్కో కంపెనీ ఒక్కో రూల్ పెడుతుంది. 12 గంటలు పని చేస్తేనే ఆ ఉద్యోగి విలవిల లాడిపోతాడు. స్ట్రెస్, డిప్రెషన్ లోకి వెళ్లి ఒక్కోసారి వర్క్ ప్రెషర్ తట్టుకోలేక చనిపోయే పరిస్థితిలు కూడా ఉంటాయి. ఇక అలాంటిది 18 గంటల పని అంటే ఇంకేమైనా ఉందా?.. ఇక అలాంటి ఘటనే ఇక్కడే జరిగింది. దానిపై ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు.యువత కెరీర్‌ను నిర్మించుకునే తొలినాళ్లలో ఎక్కువ సమయం ఆఫీసు పనికి కేటాయించాలంటూ ఓ సీఈవో ఇచ్చిన సలహా సోషల్‌మీడియా వేదికగా తీవ్ర విమర్శలకు దారితీసింది.బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ శంతను దేశ్‌పాండే లింక్డ్‌ఇన్‌ వేదికగా ఉద్యోగాల్లో కొత్తగా చేరుతున్న యువకులకు కొన్ని సలహాలిచ్చారు. కెరీర్‌ తొలినాళ్లలో రోజుకు 18 గంటలు ఆఫీస్‌ పనికి కేటాయించాలని సూచించారు.''మీ వయసు కనుక 22 ఏళ్లు అయితే, కొత్తగా ఉద్యోగంలో చేరితే అప్పుడు మీరు పూర్తిగా అందులో మునిగిపోవాలి. సరిగ్గా తింటూ, ఆరోగ్యంగా ఉంటూ.. కనీసం 4-5ఏళ్ల పాటు రోజుకు 18 గంటల పాటు ఆఫీసు పనిచేయాలి. ఈ మధ్యకాలంలో చాలా మంది యువత సోషల్‌మీడియాలో అనవసర కంటెంట్‌పై సమయాన్ని వృథా చేస్తున్నారు.


వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌, కుటుంబంతో గడపటం ముఖ్యమనుకుంటూ సర్దిచెప్పుకుంటున్నారు. అది ముఖ్యమే కానీ, కెరీర్‌ తొలినాళ్లలో మాత్రం కాదు. ఉద్యోగంలో చేరిన మొదట్లో పనే దైవంగా భావించాలి. అది ఏదైనా సరే.. తొలి ఐదేళ్లలో మీరు నిర్మించుకున్న కెరీర్‌ను బట్టే.. మిగతా వృత్తి జీవితం ఉంటుంది'' అని శంతను దేశ్‌పాండే యువతకు సూచనలు చేశారు.అయితే సీఈవో సలహాలపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ''శంతను దేశ్‌పాండే లాంటి వాళ్లను మరింత ధనవంతులను చేసేందుకు మరో తరాన్ని బానిసలుగా మారుస్తారు. ఉద్యోగులను దోపిడీ చేయడానికి తీసుకొచ్చే ఇలాంటి విష సంస్కృతులకు గుడ్‌ బై చెప్పాల్సిన సమయం వచ్చింది'' అని ఓ యూజర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.స్టార్టప్‌లలో మూకుమ్మడి ఉద్యోగుల తొలగింపులు పెరుగుతున్న వేళ.. ఇలాంటి సలహాలు యువత భవిష్యత్తుకు మరింత ప్రమాదకరంగా మారుతాయని మరో యూజర్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: