PM Kisan: త్వరలోనే నిధులు విడుదల?

Purushottham Vinay
ఇక ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12వ విడత నగదు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ విడత కింద అర్హులైన రైతులకు మొత్తం 2 వేల రూపాయలను కేంద్రం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనుంది.అయితే ఈ 2 వేల నగదు పొందేందుకు ఈ కేవైసీని కేంద్రం తప్పనిసరి చేయడం జరిగింది. PM కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత లబ్ధిదారులకు eKYC గడువు జూలై 31 వ తేదీతో ముగిసింది. అలాగే eKYCని పూర్తి చేయని వారు రూ. 2,000 ప్రయోజనం పొందేందుకు అర్హులు కాదు. ఇంకా చివరిసారిగా, ప్రధానమంత్రి కిసాన్ పథకం 11వ విడత నగదును ప్రధాని నరేంద్ర మోదీ మే 31 వ తేదీన విడుదల చేశారు. తదుపరి విడత నగదు వచ్చేసి నవంబర్లో విడుదల కానుంది. 2019 వ సంవత్సరంలో రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పీఎం కిసాన్ పథకం కింద భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి గాను రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం కింద రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేల చొప్పున మూడు విడతల్లో జమచేస్తుంది.


ఇలా రైతులు ఏడాదికి మొత్తం రూ.6వేలు చొప్పున సాయం పొందుతున్నారు.కాగా.. ఇక ఈ కైవైసీ గడువు ముగిసిన నేపథ్యంలో.. పీఎం కిసాన్ నగదుకు మీరు అర్హులా..? కాదా..? అనే విషయాలను గురించి ఒకసారి తెలుసుకోవడం ముఖ్యం. దాని కోసం ఈ కింద ఇచ్చిన సమాచారాన్ని మీరు పరిశీలించండి..PM కిసాన్ లబ్ధిదారుని స్థితిని రిజిస్ట్రేషన్ లేదా మొబైల్ నంబర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇలా తనిఖీ చేయండి. ముందుగా అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inని సందర్శించండి. తరువాత బెనిఫిషియరీ స్టేటస్ ట్యాబ్ కోసం సెర్చ్ చేసి, దానిపై క్లిక్ చేస్తే కొత్త పేజీ కనిపిస్తుంది. అలాగే మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి అంటే రిజిస్ట్రేషన్/మొబైల్ నంబర్ నమోదు చెయ్యండి.అలాగే ‘ఇమేజ్ కోడ్’ అనే బాక్స్‌లో ఇమేజ్ టెక్స్ట్ లేదా క్యాప్చ్‌ని నమోదు చేయండి.ఇక ఇప్పుడు లబ్ధిదారుని స్థితిని తనిఖీ చేయడానికి ‘ గెట్ డేటా’ బటన్‌పై క్లిక్ చేయండి. ఇక ఆ తరువాత లబ్ధిదారుని పూర్తి వివరాలు కనిపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: