సిమ్ కార్డ్ : ఇక నుంచి వారు కొనలేరు?

Purushottham Vinay
సిమ్ కార్డ్ అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్ లలో ఇంటర్నెట్ రావాలాన్నా లేక కాల్స్ మాట్లాడాల్లన్న సిమ్ కార్డ్ తప్పనిసరిగా వుండాల్సిందే.మీరు కొత్త సిమ్ కార్డ్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయం గురించి మీరు తెలుసుకోవాల్సిందే.ఈ సిమ్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నిబంధనలను మార్చింది.ఇక దీని ప్రకారం కొంతమంది కస్టమర్లకు కొత్త సిమ్ పొందడం చాలా సులభం అయింది. అయితే కొంతమంది కస్టమర్లకు మాత్రం ఇప్పుడు కొత్త సిమ్‌ను కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోయింది. పూర్తిగా చెప్పాలంటే వారు సిమ్ కార్డుని ఇక కొనుగోలు చెయ్యలేరు.ఇక నిజం చెప్పాలంటే ఇప్పుడు కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో కొత్త SIM కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఆ SIM కార్డ్ డైరెక్ట్‌గా వారి ఇంటికే వస్తుంది.ఇక సిమ్ నిబంధనలను ప్రభుత్వం పూర్తిగా మార్చింది. ఇప్పుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులు ఇక కొత్త సిమ్‌ విక్రయించలేరు.


కేవలం 18 సంవత్సరాలు పైబడిన కస్టమర్‌లు మాత్రమే ఆధార్‌ కార్డుని ధృవీకరించి కొత్త సిమ్‌ అనేది పొందవచ్చు. అలాగే కొత్త మొబైల్ కనెక్షన్‌కి uidai ఆధార్ ఆధారిత e-KYC సేవ ధృవీకరణ కోసం వినియోగదారులు కేవలం రూ. 1 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.ఇక టెలికాం శాఖ కొత్త నిబంధనల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..కంపెనీ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు సిమ్ కార్డులను అమ్మదు. ఇక ఇది కాకుండా కూడా ఒక వ్యక్తి మానసిక అనారోగ్యంతో ఉంటే అలాంటి వ్యక్తికి కొత్త సిమ్ కార్డ్ అనేది ఇక జారీ చేయదు. అలాంటి వ్యక్తి నిబంధనలను ఉల్లంఘిస్తూ సిమ్‌ కార్డ్ తోగనుక పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా కూడా దోషిగా పరిగణిస్తారు. ఇక ఇప్పుడు uidai ఆధారిత ధృవీకరణ ద్వారా కస్టమర్‌లు ఇంటి వద్ద సిమ్‌ కార్డ్ ని ఈజీగా పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: