వందకే.. ఆన్ లైన్ బంగారం.. !

Chandrasekhar Reddy
బంగారం అంటే భారతీయులకు ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండగలకు, పెళ్లిళ్లకు ఇది లేనిదే భారత్ లో పని జరగదు. అలాంటి ఏ ఉత్సవం కానివ్వండి ముందు బంగారం కొనాల్సిందే. ఎప్పటి నుండో బంగారం మీద పెట్టుబడి పెట్టడం అలవాటుగా ఉంది భారత్ లో. ఉంటె వేడుకలలో వాడేయడం, లేదంటే ఏదైనా పనికోసం పెట్టుబడిగా వాడటం భారతీయులకు బంగారంతో ముఖ్యమైన పనులు. ముఖ్యంగా ఆడవారికి ఇది లేకుండా అసలు పని జరగదు. అందుకే ఇంట్లో ఆడపిల్ల పుడితే చిన్నప్పటి నుండే ముక్కు, చెవులకు దీనితో నగానట్రా చేయిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఇలాంటి అలవాటు పెరిగి పెద్దయిన తరువాత కూడా కొనసాగుతూనే ఉంటుంది. కొందరి దగ్గర ఇదో వంశపారం పర్యంగా కూడా కొనసాగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ వంశంలో ఎవరో ఒక స్త్రీకి సంక్రమించిన ఒక బంగారు నగ లేదా బంగారు నగల సెట్ ను అలా ఆ వంశంలో కి వచ్చిన స్త్రీలకు ఇస్తూనే ఉంటారు. అది కొనసాగుతూనే ఉంటుంది.
ఇంత చరిత్ర ఉంది భారత్ లో బంగారానికి. అందుకే ఇక్కడ బంగారం ఒక వస్తువు కాదు, అదొక భావన. బంగారు నగలు ధరిస్తే అదొక గౌరవం. కొందరు అదేదో బంగారు నగల కొట్టు మాదిరి ధరిస్తారు. వారికి అలా ధరించడం ఇష్టం, అది భారతీయులు మాత్రమే మోయతగ్గ వస్తువులు. ఇక పెళ్ళిలో అయితే నల్లపూసలు మొదలు, తాళి వరకు బంగారం లేనిదే పని ఒక్క అడుగు  కూడా ముందుకు సాగదు.  కట్నకానుకలు గురించి ఇక్కడ మాట్లాడవచో లేదో కానీ అందులో కూడా ఇదొక భాగం. కట్నం ఎంత ఇచ్చినా అందులో సగం మళ్ళీ పెళ్ళిపిల్లకు బంగారు నగలుగా పెట్టిపోతలలో ఇవ్వాల్సిందే. అందుకే బంగారం భారతీయులకు ఒక బాండాగారం.
ఇప్పుడు ఇది కరోనా కారణంగా ఆన్ లైన్  లో కూడా అందిస్తున్నారు. ఇదేమో పండుగల సీజన్, దీనితో బంగారం కొనుగోళ్ల కు కూడా సీజన్. దీనితో కొన్ని బంగారు విక్రయ సంస్థలు వారి విక్రయాలు పెంచుకునేందుకు ఆన్ లైన్ లో వందకే బంగారాన్ని అందిస్తున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అని ఈ తరహా అమ్మకాలు ఎక్కువగా పెరిగిపోయాయి. టాటా తనిష్క్, కళ్యాణ్ జావెల్స్ తదితర సంస్థలు మరియు వీటి అనుబంధ సంస్థల నుండి ఆన్ లైన్ లో వందకే బంగారం కొనుక్కోవచ్చు. అలా కనీసం ఒక గ్రాము బంగారం కొన్న తరువాత దానిని డెలివరీ చేస్తారు. ఈ తరహా కొనుగోళ్ల వలన విక్రయాలు 200 శాతం పెరిగినట్టు ఆయా సంస్థలు చెపుతున్నాయి. ఎక్కువగా 3-4వేల మధ్య ఈ కొనుగోళ్లు జరుగుతున్నాయి, ఈ పండుగ సీజన్ లో ఇవి మరో 30 శాతం పెరిగే అవకాశం ఉందని సంస్త్లు అంచనా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: