విజయం మీదే: నష్టం లేని చిన్న వ్యాపార అవకాశాలివే ?

VAMSI
ఉద్యోగాల కన్నా వ్యాపారంలో రాణించాలని, వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలని చాలా మంది అనుకుంటారు. కారణం ఏంటంటే అదృష్టం కలసి వస్తే అతి తక్కువ సమయం లోనే ఆర్థికంగా మంచి పొజిషన్ కి రావడం పెద్ద కష్టమేమి కాదు. అందుకే చాలా మంది వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ లాభాలకు ఎంత అవకాశం అయితే ఉంటుందో నష్టాలకు కూడా అంతే అవకాశం ఉంది. లాభ నష్టాలు ఏవైనా సరే భరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ముందు అడుగు వేయాలి. ఇక ఒక తెలివైన వ్యాపారమంతుడు చేసే పని ఏమిటంటే నష్ట భయం తక్కువ ఉండే వ్యాపారాన్ని ఎంచుకోవడం. ఎందుకంటే లాభాలు వస్తే సంతోషమే. కానీ నష్టాలు వస్తే ఆ భారాన్ని భరించడం అందరికీ అంత ఈజీ కాదు. ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవి వారి జీవితాన్ని తారుమారు చేయొచ్చు. అందుకే ఇలాంటి వారు నష్ట భయం తక్కువగా ఉండే వ్యాపారాలను ఎంచుకోవాలి. ఇపుడు అలాంటి మూడు వ్యాపారాల గురించి తెలుసుకుందాం.
 
* కొరియర్ కంపెనీ: నష్ట భయం తక్కువ లాభ అవకాశాలు ఎక్కువగా ఉండే వ్యాపారాలలో ఇది కూడా ఒకటి. మన దేశంలో బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యాపారాల్లో కొరియర్ కంపెనీ కూడా ఒకటి. మార్కెట్లో కొరియర్ కంపెనీకి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి కొత్త వ్యాపారం స్థిరమైన లాభాలు అందుకోవాలి అనుకునే వారు ఈ వ్యాపారాన్ని ఎంచుకోవడం మంచిది.
* ఆన్‌లైన్ ఫ్యాషన్ బోటిక్: ప్రస్తుత జనరేషన్ లో ప్రజలు ఆన్లైన్ షాపింగ్ లకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా మీరు ఒక ఆన్లైన్ ఫ్యాషన్ బోటిక్ ను తెరచి ప్రజలు ఏవైతే తరచూ వినియోగిస్తూ ఉంటారు.  అటువంటి వస్తువుల కలెక్షన్లను ఇక్కడ పెడితే చాలు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటంటే.... మీరు అవి బయట నుండి కొనే వస్తువులు అయితే, వాటిని హోల్ సేల్ లో కొని తగిన ధరకు ఇక్కడ అందించాలి, లేదంటే దరఖాస్తు ఎక్కువైంది అనిపిస్తే కొనుగోలుదారులను అట్రాక్ట్ చేయడం కష్టం. లేదా మీరే సొంతంగా ఉత్పత్తి చేసిన లేదా తయారుచేసిన మంచి మంచి వస్తువులను అమ్మడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. బయట మార్కెట్లో డిమాండ్ బట్టి మీరు ఏ వస్తువులను అమ్మాలో నిర్ణయించుకోవడం మంచిది.
* టైలరింగ్: మీకు వీలైనంతలో ఒక చిన్న టైలరింగ్ షాపును నెలకొల్పి ఇద్దరు ముగ్గురు వర్కర్లతో బిజినెస్ స్టార్ట్ చేసి ఔట్ పుట్ ను బట్టి మీ ఆలోచనలను ముందుకు నడపండి.  మీరు చేసేటటువంటి దుస్తుల డిజైన్లను ఆన్ లైన్ లో పెట్టి అమ్మకం చేయడం కూడా ఒక మంచి ఆలోచనే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: