60వేల మార్క్ దాటేసిన సెన్సెక్స్..

Chandrasekhar Reddy
దేశంలో కరోనా నెమ్మదిస్తు ఉండడంతో మార్కెట్లు పుంజుకుంటున్నాయి. మోడీ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడుల ఆకర్షణ కూడా జరుగుతుండటంతో దేశీయ మార్కెట్లలో జారు కనిపిస్తుంది. అమెరికా వంటి దేశాలతో కొత్త ఒప్పందాలకు నాంది పడుతుండటం కూడా ఈ జోష్ కు కారణంగా ఆర్థికవేత్తలు చెపుతున్నారు. కరోనా రెండో వేవ్ లో కాస్త నెమ్మదించిన మోడీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కరోనా పై పోరాటం ఒక్క వాక్సినేషన్ ద్వారానే సాధ్యం అని దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు. రోజుకు కోటిపైనే వాక్సిన్ లను వేస్తుంది ప్రభుత్వం. దేశంలో పలు రాష్ట్రాలలో ఉపఎన్నికల సందడి ఉండటంతో ఆయా రాష్ట్రాలలో వంద శాతం వాక్సినేషన్ చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రాధాన్యత క్రమాలలో ముందు పెద్దలకు అనంతరం 18 ఏళ్ళు దాటిన వారికి వాక్సినేషన్ జరుగుతుంది. ఇంకా పిల్లలకు వాక్సిన్ రాలేదు, మరో ఏడాది పట్టొచ్చు అంటున్నారు. థర్డ్ వేవ్ మాత్రం వచ్చే నెలలో వస్తుందని వైద్య శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇలాంటి పలు కారణాలతో దేశీయ సూచికలలో ఉత్సాహం నెలకొంది.
తాజాగా దేశీయ  మార్కెట్లు మరో కొత్త రికార్డును సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్ నేడు 60 వేల మార్క్ దాటి కొత్త రికార్డు నెలకొల్పింది. కరోనా సంక్షోభం తరువాత ఈ రికార్డు ఆర్థికపురోభివృద్దిని ఉత్సాహపరుస్తుందని నిపుణులు అంటున్నారు. నేడు రోజంతా లాభాలతో కొనసాగిన మార్కెట్లు ముగిసే సమయానికి 60148 వద్ద ముగిశాయి. నిఫ్టీ కూడా 30 పాయింట్లు పెరిగి 17853 వద్ద ముగిసింది. నిన్న కూడా దేశీయ సూచికలు ఉత్సాహంగానే ఉండటం తెలిసందే.
బీఎస్ఈ  సెన్సెక్స్ లో బాగా లాభాలు పొందిన వారిలో ఏషియన్ పెయింట్స్ 3.72 శాతం; మహీంద్రా అండ్ మహీంద్రా 2.74 శాతం; హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు 1.98 శాతం; భారతీయ ఎయిర్ టెల్ 1.79 శాతం; మారుతి సుజుకి 1.59 శాతంగా ఉన్నాయి.
నష్టాలలో ట్రేడ్  అయిన వారిలో టాటా స్టీల్; స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా; యాక్సిస్ బ్యాంకు; ఐటీసీ; హిందూస్తాన్ యూనీలీవర్ లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: