‘తేజస్’ ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ వినూత్న ప్రయోగం....?

Suma Kallamadi
సర్‌ప్రైజ్ బర్త్ డే ప్లాన్ చేసుకోవడం, ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇటీవల కాలంలో ఓ ట్రెండయిపోయింది. అయితే, ఇది ఈ మధ్య కాలంలోది మాత్రమే కాదు. గతంలోనూ ఉండేది. కానీ, ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ యూసేజ్ పెరగగా, ఇందుకు సంబంధించిన వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో అవి బాగా పాపులర్ అవుతున్నాయి. 

ఈ క్రమంలోనే రైలులో బర్త్ డే పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. చాలా బాగుంటుంది..కదా..  కాగా, బర్త్ డే పార్టీ ట్రైన్‌లో చేసుకోవడం అస్సలు కుదరదు అన్న సంగతి ప్రతీ ఒక్కరికి విదితమే. మరీ ముఖ్యంగా నడుస్తున్న ట్రైన్‌లో సెలబ్రేషన్స్ చేసుకోవడం అస్సలు కుదరదు. పక్కనున్న వారికి డిస్ట్రబ్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అలాంటివి సాధ్యం కాదు అని మీరనుకుంటే పొరపడినట్లే.. ఎందుకంటే ప్రయాణికులకు ట్రైన్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్‌కు‌గాను అవకాశాన్ని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కల్పిస్తోంది. ఇందుకోసమై స్పెషల్ స్కీమ్ తీసుకొచ్చింది. ‘తేజస్’ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేవారు ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారి వివరాలు ఐఆర్సీటీసీకి అందుతాయి. దీనిలో ప్రయాణికుల బర్త్ డే వివరాలు తప్పక ఉంటాయి.

 వాటి ప్రకారం ‘తేజస్’ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది ప్రయాణికుల బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోవచ్చు. కాగా, కొవిడ్ సెకెండ్‌ వేవ్ తర్వాత ‘తేజస్’ ఎక్స్‌ప్రెస్ సేవలు ఆగస్టు 6 నుంచి తిరిగి అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ నేపథ్యంలోనే కస్టమర్స్‌ను అట్రాక్ట్ చేసేందుకుగాను ఈ స్కీమ్ తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ. తాజాగా లక్నో-ఢిల్లీ ‘తేజస్’ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఆరతి మిశ్రా, అంకుర్ శుక్లా తమ పిల్లలతో పాటు బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రైలులో పుట్టినరోజు జరపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ వినూత్న పథకం గురించి తెలుసుకుని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: