సెప్టెంబర్‌ నెలలో బ్యాంకు సెలవుల వివరాలు ఇవే..!

Suma Kallamadi
ప్రజెంట్ టైమ్స్‌లో ప్రతీ ఒక్కరికి దాదాపుగా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇకపోతే అందరూ బ్యాంక్ ట్రాంజాక్షన్స్ చేస్తూ ఉండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చేయడం అనేది మస్ట్‌. ఒకవేళ అకౌంట్‌లో డబ్బులు లేకపోతే ట్రాంజాక్షన్స్ చేయడం చాలా కష్టం. వివిధ అవసరాల నిమిత్తం అందరికీ అమౌంట్ ఫిజికల్‌గా డిస్ట్రిబ్యూట్ చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే బ్యాంకు అకౌంట్స్‌లో డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక వ్యాపారులకు అది కంపల్సరీ కాగా, సెప్టెంబర్ నెలలో ఈ రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటున్నందున ముందే ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్‌గా బ్యాంక్‌లకు సండే హాలీ డే అన్న సంగతి అందరికీ విదితమే.  ప్రతీ నెల రెండో, నాల్గో శనివారం పూర్తి సెలవు ఇస్తున్నారు. మిగిలిన రెండు శనివారాలు పూర్తిగా బ్యాంకులు పనిచేస్తాయి. ఈ విధానం వచ్చిన తర్వాత బ్యాంకులకు వరుస సెలవులు రావడం మొదలైంది. అలా వరుసగా సెలవులు రావడం వల్ల కస్టమర్స్‌కు ఇబ్బందులు తలెత్తొచ్చు. 

ఈ నేపథ్యంలోనే సెలవులకు సంబంధించిన వివరాలు కస్టమర్స్‌కు తెలిస్తే వారు మందుగానే వారికి సంబంధించి ఆర్థిక లావాదేవీలను పూర్తి చేసుకుంటారు. ఇందుకుగాను ఆర్‌బీఐ సెప్టెంబర్ నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. సెప్టెంబర్ మంత్‌లో మొత్తంగా ఏడు రోజులు బ్యాంకులకు ఉన్నాయి. ఇవే కాకుండా, వచ్చే నెలలో 6 వారాంత సెలవులు కూడా ఉంటాయి. అవి సెలవుల జాబితాలోనే ఉండనున్నాయి. అవేంటంటే..సెప్టెంబర్ 5, 12, 19, 25 – 26 తేదీలలో బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. సెప్టెంబర్ 11న ఆర్బీఐకి తప్పనిసరి హాలీ డే. అయితే, ఇది రెండో శనివారంతో కలిసి ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో స్థానికంగా ఉండే పండుగలకుగాను ఆర్‌బీఐ సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 8న శ్రీమంత శంకరదేవుని తిథి, 9న తీజ్, 10న గణేశ్ చతుర్థి, 11న గణేశ్ చతుర్థి (రెండో రోజు), 17న కర్మ పూజ, 20న ఇంద్రజాత్రా, 21 న శ్రీ నారాయణ గురు సమాధి దినం. పైన పేర్కొనబడిన హాలిడేస్ వివిధ రాష్ట్రాల్లో ఉండే పండుగలను బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మేరకు సెలవులు డిక్లేర్ చేయబడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: