నెట్ వ‌ర్కింగ్ మార‌థాన్ హైలెట్స్.. !

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో చిన్న మరియు మ‌ద్య‌స్థాయి వ్యాపారులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. అంతే కాకుండా క‌రోనా కార‌ణంగా కొత్త‌గా వ్యాపారాన్ని ప్రారంభించాల‌నుకునే వారికి కూడా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. దాంతో కొత్త‌గా వ్యాపారాన్ని ప్రారంభించాల‌నుకునేవారికి...అలాగే వ్యాపారంలో న‌ష్ట‌పోయినవారికి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చేందుకు మహతి మార్కెట్ ఎసెన్షియల్జ్ ఎల్ ఎల్ పీ అనే సంస్థ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ సాయంతో నెట్ వ‌ర్కింగ్ మార‌థాన్ పేరుతో ఓ వినూత్న కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వ్యాపారుల వరకు వ్యాపారవేత్తలు, కొత్త‌గా వ్యాపారాన్ని ప్రారంభించాల‌నుకునేవారు వ్యాపార‌వృద్ధికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై స‌ల‌హాలు సూచ‌న‌ల‌ను అందిస్తుంది. 

ఈ కార్య‌క్ర‌మంలో హాజ‌రైన వ్యాపారస్థులు త‌మ ఆలోచ‌న‌లు పంచుకోవ‌డం ద్వారా కూడా వ్యాపార‌వృద్దికి స‌హాయ‌ప‌డుతుంది. ఇటీవ‌ల హోట‌ల్ నోవెట‌ల్ లో నిర్వ‌హించిన మార‌థాన్ కు విశేష స్పంద‌న ల‌భించింది. సీజ‌న్-1 కు ముఖ్య అతిథిగా శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలంగాణ టూరిజం చైర్మన్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కార్య‌క్ర‌మ నిర్వాహ‌కులపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఎంతో మంది వ్యాపారులు త‌మ వ్యాపారాన్ని వృద్ధి చెందేలా చేసుకోవడానికి స‌ల‌హాల‌ను సూచ‌ల‌ను ఇస్తుంద‌ని చెప్పారు. ఇక ఈ కార్య‌క్ర‌మం ఎంతో మంది య‌వ వ్యాపార‌వేత్త‌ల‌లో ఆత్మ‌స్థైర్యాన్ని నింపింది.

ఆదిత్య ముండ‌డ (అన్ ఫోల్డ్ ఈవెంట్స్) :
నెట్వ‌వర్కింగ్ మార‌థాన్ ద్వారా 20కి పైగా సంస్థ‌ల‌తో సంబంధాలు ఏర్ప‌డ్డాయి. హోట‌ల్స్, రిసార్ట్స్ తో వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాయి.

ఇర్ఫాన్ జైపూరీ (ఎర్త్ వాల్క‌ర్స్ ముంబై) :
ఎంతోమంది వ్యాపార‌స్థుల‌ను క‌లుసుకున్నాం...వ్యాపారాన్ని వృద్ధి చెంద‌డానికి ఈ మీటింగ్ ఎంతో స‌హాయ‌ప‌డింది. ఆరోగ్య‌క‌ర‌మైన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోడానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

కేవీ ప్ర‌దీప్ {న‌టుడు మోటివేష‌నల్ ట్రైన‌ర్} :
ఈ కార్య‌క్ర‌మానికి నేను 10కి 9 మార్కులు వేస్తాను. ఇది ఫుల్ పైసా వ‌సూల్ కార్య‌క్ర‌మం. మ‌హ‌తి ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఎంతో మందికి స‌హాయ‌ప‌డింది.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: