ఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ..?

Suma Kallamadi
మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థల మీద గుత్తాధిపత్యం ఆర్బీఐ కి ఉంటుందనే విషయం చాలా మందికి తెలుసు. బ్యాంకింగ్ రంగంలో ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం కేవలం ఆర్బీఐకి మాత్రమే ఉంది. అటువంటి ఆర్బీఐ తాజాగా ఓ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో బ్యాంకింగేతర సంస్థలు ఊరట చెందనున్నాయి. ఇండియాలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్న బ్యాంకింగేతర సంస్థలను కూడా సీపీఎస్ వ్యవస్థలో భాగం చేస్తున్నట్లు తాజాగా ఆర్బీఐ ప్రకటించింది. అలాంటి సంస్థలు దశల వారీగా RTGS, NEFT విధానాల్లో కూడా లావాదేవాలు జరపొచ్చని తెలిపింది. కాగా బ్యాంకింగేతర సంస్థలకు సీపీఎస్ యాక్సెస్ ఇవ్వనున్నట్లు ఆర్బీఐ ఏప్రిల్ లోనే ప్రకటించింది. కాగా ఇంత వరకు RTGS, NEFT సౌలభ్యం కేవలం రిజిస్టర్ డ్ బ్యాంకులకు మాత్రమే ఉండేది. కానీ ఆర్బీఐ తాజా ఆదేశాలతో బ్యాంకింగేతర సంస్థలకు కూడా ఈ సౌలభ్యం అందుబాటులోకి రానుంది. ఇలా బ్యాంకింగేతర సంస్థలను ప్రోత్సహించేందుకు సీపీఎస్ విధానంలో వారిని భాగస్వామ్యం చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

సీపీఎస్ యాక్సెస్ కోసం బ్యాంకేతర పీఎస్పీలు కేంద్ర బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాలను నెరవేర్చాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. ఇలా నెరవేరుస్తేనే కేంద్ర బ్యాంక అంగీకారంతో వారికి సీఓఏ అందనుంది. లేదంటే అటువంటి సంస్థలకు సీఓఏ అందకుండా పోతుందని ఆర్బీఐ తెలిపింది. పేమెంట్ల చట్టం 2007 ప్రకారం సీఓఏ కు చాలా విలువ ఉంది. ఇలా ప్రస్తుతం బ్యాంకింగేతర సంస్థలకు కూడా సదుపాయాలు కల్పించడంతో డిజిటల్ పేమెంట్లకు మరింత ఊతం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా ఆర్బీఐ కూడా డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే లక్ష్యంతోనే అడుగులేయడం గమనార్హం. ఇలా ఆర్బీఐ ప్రకటించిన విధానాల వల్ల మన దేశంలో డిజిటల్ పేమెంట్ల సంఖ్య పెరుగుతుందో లేదో వేచి చూడాలి. ఎంతైనా ఇలాంటి డిజిట‌ల్ పేమెంట్లు రాను రాను మ‌న దేశానికి చాలా అవ‌స‌ర‌మ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rbi

సంబంధిత వార్తలు: