ప్రపంచంలో అతి తక్కువగా పెట్రోల్ ధరలు ఉన్న దేశాలు ఇవే ?
పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్న ఐదు దేశాలు:
ప్రపంచవ్యాప్తంగా ఒక వెనుజులా దేశంలో మాత్రమే అన్ని దేశాల కంటే అత్యంత తక్కువగా పెట్రోల్ ధరలు ఉంటాయి. వెనుజులా దేశం లో లీటర్ పెట్రోల్ ధర కేవలం 0.02 డాలర్ గా ఉంటుంది. అలాగే వెనుజులా తరువాత స్థానంలో ఇరాన్ దేశం ఉంటుంది. ఇరాన్ దేశంలో చూసుకున్నట్లయితే.. లీటర్ పెట్రోల్ ధర...0.067 డాలర్ మాత్రమే ఉంటుంది. ఇక అంగోలా దేశం పెట్రోల్ ధరలు మూడో స్థానంలో నిలుస్తోంది. అంగోలా దేశములో లీటర్ పెట్రోల్ ధర 0.249 డాలర్ మాత్రమే ఉంటుంది. ఇక నాల్గవ స్థానంలో అల్గేరియా దేశం ఉండనుంది. అల్గేరియా దేశంలో 0.344 డాలర్లు మాత్రమే పెట్రోల్ లీటర్ ధర ఉంటుంది. 5వ స్థానం విషయానికి వస్తే.... వరుసలో కువైట్ దేశం నిలుస్తుంది. కువైట్ దేశం లో ఒక లీటర్ పెట్రోల్ ధర కేవలం 0.349 డాలర్లు మాత్రమే ఉంటుంది.
అత్యంత పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్న దేశాలు :
పెట్రోల్ ఎక్కువగా ఉన్న దేశాల్లో హాంకాంగ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో లీటర్ పెట్రోల్ ధర 2.485 డాలర్లు గా ఉంటుంది. ఇక రెండో స్థానంలో నెదర్లాండ్స్ ఉండగా.... అక్కడ లీటర్ పెట్రోల్ ధర 2.056 డాలర్లుగా ఉంటుంది. ఇంకా మూడో స్థానంలో నార్వే దేశం ఉంటుంది. అక్కడ పెట్రోల్ ధర 2.056 డాలర్లు. సెంట్రల్ రిపబ్లిక్ (2.05) నాలుగో స్థానం ఉండగా ఐదో స్థానంలో మొనాకో దేశం (2.003) ఉంటుంది. ఇక మన ఇండియా దేశానికి వస్తే... పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్న జాబితాలో 58వ స్థానంలో ఉంటుంది. మనదేశంలో లీటర్ పెట్రోల్ ధర 1.38 డాలర్లు గా ఉంది.