బిజినెస్ : వ్యాపారం మొదలు పెట్టేవారికి మోడీ సర్కార్ శుభవార్త..

Divya

కరోనా ఉధృతికి తట్టుకోలేక..ఉద్యోగాలకు వెళ్ళలేక , ఉన్న ఉద్యోగాలను కోల్పోయి, చాలామంది ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ని మీలో ఎవరైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..? అయితే అందుకోసం డబ్బు కావాలి..? వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి, మీ దగ్గర డబ్బులు లేకపోతే భయపడాల్సిన అవసరం లేదని అంటుంది మోడీ సర్కార్.. ఎందుకంటే మోడీ సర్కార్ ఎవరైతే వ్యాపారం చాలనుకుంటున్నారో..?  అలాంటి వారికి ఒక స్కీం కింద ఏకంగా పది లక్షల రూపాయలను అందించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఆ స్కీం ఏమిటి ..? ఆ స్కీం వివరాలు ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..
ఆ పథకం ఏదో కాదు ముద్ర యోజన. ఈ పథకం కింద ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో, అలాంటి వారికి లోన్  లభిస్తుంది. ఇందులో రూ. పది లక్షల వరకు లోన్ తీసుకునే అవకాశం,  కేంద్ర ప్రభుత్వం మనకు అందిస్తోంది. అయితే ఈ స్కీం కింద ఒక్కో బ్యాంకు,  ఒక్కో ప్రాతిపదికన వడ్డీరేట్లను వసూలు చేయడం జరుగుతుంది. ఇక ఈ ముద్ర లోన్ స్కీమ్ పై కనీస వడ్డీ రేటును దాదాపుగా 12 శాతం నుంచి మొదలవుతుంది అని చెప్పవచ్చు. ఈ ముద్ర స్కీం కింద మూడు కేటగిరీలు మనకు అందుబాటులో ఉన్నాయి.
అందులో తరుణ్, కిషోర్, శిశు కేటగిరీలు. ఇక మీరు చిన్న వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే , శిశు కేటగిరీ ని ఎంచుకోవచ్చు. ఇందులో రూ.50 వేల లోన్ వరకు లభిస్తుంది. ఇక మధ్యస్తంగా వ్యాపారం పెట్టాలనుకునే వారికి , కిషోర్ కేటగిరి ఉత్తమం అని చెప్పవచ్చు. ఇందులో దాదాపు రూ.ఐదు లక్షల లోన్ వరకు లభిస్తుంది. ఇక పెద్ద మొత్తంలో వ్యాపారం పెట్టాలనుకునే వారికి , తరుణ్ కేటగిరి కింద దాదాపు రూ. 10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.
ఎవరైతే ఈ ముద్ర స్కీమ్ కింద లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో, అలాంటివారు సంబంధిత బ్యాంకు లోకి వెళ్లడం లేదా https://www.mudra.org.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవడానికి  కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. ముందుగా మీరు ఈ వెబ్సైట్ ద్వారా ఈ స్కీం కు అర్హులో , కాదో తెలుసుకొని ఆ తర్వాత బ్యాంకులకు వెళ్లి లోన్ కు  అప్లై చేసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: