ఇవి ఉంటే చాలు పది లక్షల ఉచిత ఇన్సూరెన్స్..!

MOHAN BABU
ప్రస్తుత కాలంలో  కరోనా వైరస్ ఎక్కువగా విజృంభిస్తుండడంతో ఇన్సూరెన్స్ కంపెనీలు అనేక ఆఫర్లతో  కరోనాను క్యాచ్ చేసుకుంటున్నాయి. ఈ విధంగా ఆఫర్లు ఇస్తూ ప్రజల వద్దకు వస్తున్నాయి. బ్యాంకులు జారీ చేసేటటువంటి డెబిట్, క్రెడిట్ కార్డులు కాంప్లిమెంటరీ పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ తో వస్తాయి. కానీ దీని గురించి చాలామంది ప్రజలకు తెలియదు. రూపే కార్డు, డెబిట్ కార్డు ఖాతాదారులకు మాత్రమే బ్యాంకు కవరేజ్ అందిస్తుందని  చెన్నైకి చెందిన  బ్యాంకు సీనియర్ అధికారి తెలిపారు. బ్యాంకు జారీచేసిన అన్ని క్రెడిట్ డెబిట్ కార్డులు భీమా కవరేజ్ అందిస్తాయని ఆయన అన్నారు.


ప్రమాదవశాత్తు  ఖాతాదారులు మృతిచెందిన, శాశ్వత సంపూర్ణ వైకల్యం చెందిన  భీమా మాత్రం అందిస్తారు. క్రెడిట్ డెబిట్ కార్డులు బట్టి  భీమా కవరేజ్ అనేది 50 వేల నుంచి 10 లక్షల రూపాయల వరకూ లభిస్తుందన్నారు. అనుకోకుండా జరిగిన ప్రమాదాలతో ఖాతాదారుడు మరణిస్తే లేదా శాశ్వత వైకల్యం పొందితే  ఈ బీమా పాలసీ  వర్తిస్తుందని ఇండియన్ బ్యాంకు అధికారి తెలిపారు. ఇందులో ఉద్దేశపూర్వకంగా స్వయంగా జరిగినటువంటి ప్రమాదాలకు ఈ బీమా వర్తించదని  ఆయన తెలిపారు. భీమా కవరేజ్ అనేది  బ్యాంకులో వినియోగదారునికి ఉన్న సంబంధం మీదనే ఆధారపడి భీమా కవరేజ్ రెండు లక్షల నుంచి ప్రారంభమై  కార్డులు వాడుతూ ఉండాలి.  ఇలాంటి సదుపాయాల గురించి ఖాతాదారులకు తెలియజేయడం బ్యాంకుల విధి అని, వినియోగదారుల ఫోరం ప్రెసిడెంట్ సదాగోపం అన్నారు. భీమ క్లైమ్ చేసుకోవడానికి ఒక షరతు  ఉంటుందని అదేమిటంటే కార్డ్ ఎప్పుడు యాక్టివ్ యూస్ లో ఉండాలి ఉన్నారు. ఆ క్లయిమ్  కూడా నిర్దిష్ట కాలపరిమితి లోనే చేయాలని అన్నారు.


ఉదాహరణకు రూపే బీమా కార్యక్రమం కింద  ప్రమాదం జరిగిన తేదీ నుంచి  90 రోజుల లోగా  క్లయిమ్  గురించి సమాచారం అందించాలని, అలాగే క్లయిమ్ కు సంబంధించి నటువంటి అన్ని రకాల డాక్యుమెంట్లను సమా ధానం ఇచ్చిన తేదీ నుంచి 60 రోజుల లోగా బ్యాంకులో సబ్మిట్ చేయా లన్నారు. ప్రమాదం జరిగిన తేదీకి 90 రోజుల ముందు కార్డుదారులు ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసి ఉండాలి. ఖాతాదారులకు అందించే బీమా రకం, భీమ క్లైమ్ గురించి బ్యాంకు అధికారులను సంవత్సరానికి ఒకసారి ఆడిట్  చేయాలని బ్యాంకు నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: