ఆర్‌బీఐ అదనపు నిర్ణయాలు ఇవే..!

Suma Kallamadi
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఆర్బీఐ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన సామాన్య ప్రజలు, వ్యాపారాలకు సహాయపడటానికి అదనపు ద్రవ్య, నియంత్రణ విధాన చర్యలను ప్రకటించింది.

కాంటాక్ట్-ఇంటెన్సివ్ సెక్టార్:


మానిటరీ పాలసీని సమీక్షిస్తూ ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇలా మాట్లాడారు.. కరోనా నేపథ్యంలో స్థూల ఆర్థిక పరిస్థితి, ఆర్థిక మార్కెట్ పరిస్థితులను నిరంతరాయంగా అంచనా వేసిన మేము కొన్ని అదనపు చర్యలు ప్రకటిస్తున్నామని ఆయన అన్నారు. కరోనా కారణంగా కాంటాక్ట్-ఇంటెన్సివ్ సెక్టార్ పై పడిన ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేకంగా 15 వేల కోట్ల లిక్విడిటీ ప్రకటిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ స్కీం ద్వారా వ్యాపారస్తులు మార్చి 31, 2022 లోపు అప్పు తీసుకోవచ్చని ఆయన తెలిపారు.


గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ.. ఈ స్కీం కింద బ్యాంకులు.. హోటల్స్, రెస్టారెంట్స్, ట్రావెల్ ఏజెంట్స్, టూర్ ఆపరేటర్స్, ప్రైవేటు బస్సు ఆపరేటర్స్, బ్యూటీ పార్లర్లు, సెలూన్స్, తదితర వ్యాపారస్తులకు ఫ్రెష్ గా ఋణాలు ఇవ్వొచ్చని చెప్పుకొచ్చారు. ఇలాంటి రుణాలు అందించే బ్యాంకులు ప్రోత్సహించబడతాయని ఆయన అన్నారు. ఇంతకముందు ఆర్‌బీఐ ప్రకటించిన 50 వేల కోట్ల ద్రవ్యోల్బణానికి ఇప్పుడు ప్రకటించిన 15 వేల కోట్లు అదనం అని గవర్నర్ స్పష్టం చేశారు.


స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 16 వేల కోట్లు:


ఆపత్కాలంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా ఉండేందుకు ఆర్బీఐ 16,000 కోట్ల ప్రత్యేక ద్రవ్యతను స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఇండియా బ్యాంక్ కి అందించింది. ఐతే ఈ సేవ ఒక సంవత్సరం వరకు ప్రస్తుత రెపో రేటు వద్ద అందుబాటులో ఉండనుంది. ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ ఇండియా బ్యాంక్ పని తీరుని బట్టి రేపో రేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది.


రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0 స్కీమ్:


ఆర్బీఐ రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0 స్కీమ్ ద్వారా ఇచ్చే రుణాల మొత్తాన్ని పెంచాలని నిర్ణయించింది. ఫ్రేమ్ వర్క్ 2.0 కింద రుణగ్రహీతల సంఖ్యను పెంచాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలు, ఇతర కంపెనీలు, వ్యక్తిగత రుణాలు 25 కోట్ల నుంచి 50 కోట్లకు పెంచాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.


విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను ప్రోత్సహించడం:


ఇండియన్ డెబ్ట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేలా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక రకాల చర్యలను చేపట్టిందని గవర్నర్ వెల్లడించారు. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల తరుఫున అనుమతులన్న బ్యాంక్ డీలర్స్ మార్జిన్ పెట్టుకోవచ్చు అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: