లాటరీ పేరుతో టోకరా.. ఏకంగా 20 కోట్లు లూటీ..

Satvika
కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ ఉన్న ఆస్తిని, కుటుంబాన్ని.. చివరిను ప్రాణాలను కూడా కోల్పోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు.. అయితే మరి కొందరు అడ్డదారుల్లో డబ్బులు సంపాదించే క్రమంలో అమాయకపు ప్రజలను నిలువునా మోసపోతున్నారు. చీటీలు పేరుతో నమ్మ బలికి అదును చూసుకొని బోర్డు తిప్పేస్తున్న ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. లాటరీ పేరుతో భారీ టోకరా పెట్టారు.. ఏకంగా 20 కోట్లు లూటీ చేశారు.

పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కచ్చితమైన బహుమతులు ఇస్తామని చెప్పిన ఓ వ్యక్తి బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దోచేశాడు. దాదాపు రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు బాధితుల నుంచి వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.తీరా మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాలు.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారానికి కొద్ది సంవత్సరాల క్రితం వచ్చిన ఓ వ్యక్తి అద్దె ఇంట్లో ఉంటూ ఆయుర్వేద , భూత వైద్యుడిగా చెలామణి అయ్యాడు. అతడు కొంతకాలంగా చిన్న చిన్న స్కీములు నిర్వహిస్తూ.. ధర్మారం, వెల్గటూరు మండలాల్లో పరిచయాలు పెంచుకున్నాడు..

నెలకు 3000 చెల్లిస్తే అన్ని డ్రాలు ఒకేసారి తీసి విజేతలకు బహుమతులు అందిస్తామని మళ్లీ రెండో స్కీమ్‌ను కూడా ప్రారంభించాడు.అయితే ఇదివరకే అతడు కొందరికి బహుమతులు ఇవ్వడంతో.. చాలా మంది అతడిని నమ్మి రెండో స్కీమ్‌లో చేరారు. మొదటి స్కీమ్‌లో డబ్బులు కట్టిన కొందరు కూడా రెండో స్కీమ్‌లో చేరారు.. అయితే తనకు కావలసిన డబ్బులు వస్తే ఏకంగా బోర్డును తిప్పేస్తున్నారు. బంపర్ బహుమతులు వారికే వచ్చేలా చేస్తానని నమ్మించాడు. ఇలా వారి అత్యాశను ఆసరాగా చేసుకుని ఒకరికి తెలియకుండా మరోకరి దగ్గర.. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ .15 వేల నుంచి రూ .20 వేల వరకు వసూలు చేశాడు. అలాగే పెద్ద మొత్తంలో గిఫ్ట్‌లు చెల్లించాల్సి ఉందని.. అందుకోసం వస్తువులు కోనాల్సి ఉందని చెప్పి ధర్మారంలోని కొందరు వ్యాపారులను కూడా అతను బోల్తా కొట్టించాడు.. అలా 20 కోట్లు తీసుకొని రాత్రికి రాత్రే.. ఉడాయించాడు.. డబ్బులకు కక్కుర్తి పడి ఇలాంటివి నమ్మవద్దని పోలీసులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: