ఇలాంటి ఐడియా ఒక్కటి ఇస్తే .. ఊహించలేనంత డబ్బులు వస్తాయట..

Satvika
ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటే ఇదే... కొన్ని ప్రాంతాల్లో మంచి బిజినెస్ ఐడియా చెబితే మంచిగా ముట్ట చెబుతారు.. అవును ఇది నిజంగానే కొన్ని కంపెనీలు కూడా అందుబాటు లోకి తీసుకువచ్చారు. తమ బిజినెస్ డెవలప్ అవ్వడానికి ఒక్క ఐడియా ఇస్తే లక్షలు ఇస్తున్నారు. ఆ కంపెనీలు ఏంటి? ఎటువంటి ఐడియాలు ఇవ్వాలి ? ఎలా మనకు లాభం వస్తుంది వంటి అంశాల గురించి పూర్తి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రభుత్వ రంగానికి చెందిన ఎన్‌టీపీసీ కంపెనీ అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. మంచి ఐడియా చెబితే రూ. 5 లక్షలు అందిస్తోంది. పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే వేస్టేజ్‌ ను 100 శాతం ఉపయోగించుకోగలిగే ఐడియా ఇవ్వాలి. ఇందులో భాగంగా రూ.12 లక్షల ప్రైజ్ మనీ అందిస్తారు. పర్యావరణం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం, వారి సలహాలు తీసుకోవడం వంటివి ఈ కాంపిటీషన్ ప్రధాన ధ్యేయం..


ఇకపోతే ఇలా ఐడియా లు చెప్పడానికి సమయం కొద్ది రోజులు మాత్రమే ఉంది.. 2021 మే 19 వరకు ఛాన్స్ ఉంటుంది. ఈలోపు మీరు మీ సలహాలు ఇవ్వాలి. ఎవరైతే మంచి ఐడియా ఇస్తారో వారికి తొలి బహుమతి కింద రూ.5 లక్షలు అందిస్తారు. విద్యుత్ ఉత్పత్తి సమయంలో పలు రకాల వ్యర్థాలు వెలువడుతాయి. సరైన సొల్యూషన్ మాత్రం చెప్పాలి.. అయితే, ఎన్‌టీపీసీ సంస్థ కు 70 పవర్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 26 రెన్యూవబుల్ ప్రాజెక్టులు. ఇంకా 18 జీడబ్ల్యూ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు తయారీ లో ఉన్నాయి. కంపెనీ 65825 మెగా వాట్ల విద్యుత్‌ ను ఉత్పత్తి చేస్తోంది.. ఇంక ఆలస్యం ఎందుకు మీ మేధస్సుకు పని పెట్టండి ఆ ఐదు లక్షలు మీరే సొంతం చేసుకోండి..

గమనిక: ఈ ఐడియా విధానం గురించి అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చును..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: