
పదివేలు పెట్టుబడి పెడితే.. రెండు లక్షలు లాభమట.. ఎలాగంటే?
మైక్రో బచత్ ప్లాన్ ఒకటి. దీని ద్వారా మెచ్యూరిటీ సమయం లో డబ్బులు వస్తాయి. అదే ఒకవేళ ముందే చనిపోతే కుటుంబ సభ్యులకు డబ్బులు లభిస్తాయి. ఈ ప్లాన్ తక్కువ ఆదాయం కలిగిన వారికి బాగుంటుంది. ఈ స్కీమ్ ను ఎల్‌ఐసీ అందిస్తోంది. మైక్రో బచత్ ప్లాన్ నాన్ లింక్డ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్. దీని వలన సూపర్ బెనిఫిట్స్ కలుగుతాయి. ఒక పక్క రక్షణ ఉంటుంది. అలానే మరో పక్క మంచి రాబడి కూడా ఉంటుంది. ఇలా మీరు రెండు బెనిఫిట్స్ ని కూడా పొందవచ్చు. ఈ పాలసీపై లోన్ కూడా తీసుకోవచ్చు..
తక్కువ ఆదాయం కలిగిన వారి కోసం ఈ స్కీమ్ ను అమల్లోకి తీసుకు వచ్చింది. పాలసీదారుడు మరణిస్తే.. నామినీకి డబ్బులు వస్తాయి. పాలసీ ప్రీమియంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. వీటిలో ఎలా మని ఇన్వెష్ట్ చేయాలి. ఎంత లాభం వస్తుంది. ఎలా ఈ స్కీమ్ లో చేరోచ్చు అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..పాలసీ టర్మ్ 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లు ఉంటుంది. 55 ఏళ్ల వయసు లోపు ఉన్న వారంతా పాలసీ తీసుకోవడానికి అర్హులే. 25 ఏళ్ల వయసు కలిగిన వారు రూ.2 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే పాలసీ టర్మ్ 15 ఏళ్లు. ఇప్పుడు సంవత్సరానికి రూ.10,320 ప్రీమియం చెల్లించాలి.ఈ స్కీమ్ వల్ల రెండు లక్షల వరకు లాభం వస్తుంది.. చేసుకొనే వాళ్ళు అన్నీ రకాలు పరిశీలించి చేసుకోవాలి.