ఈ బిజినెస్ చేస్తే లక్ష్మీ దేవి తలుపుతట్టినట్లే?

Satvika
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బిజినెస్ చేయాలని భావిస్తారు.. ఎలాగో నష్టాల్లో ఉన్నాము.. పోతే పెట్టుబడి, వస్తే లాభాలు అని చాలా మంది అనుకుంటారు. కొందరు మాత్రం ఉన్నది ఎందుకు పోగొట్టుకోవడం.. ఉన్నదాంట్లోనే గంజి తాగి పడుకోవచ్చు అని అనుకుంటారు. అయితే మీరు బిజినెస్ చేయాలని అనుకుంటే మాత్రం ఈ బిజినెస్ ఒక్కటే చేస్తే లక్షల్లో లాభాలను పొందవచ్చు. అదే బనానా చిప్స్ బిజినెస్. ఈ వ్యాపారం చేయడం వల్ల మంచి రాబడి పొందొచ్చు. ఈ బిజినెస్ ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం..



కొన్ని ఏరియాల్లో ఆలు చిప్స్, ఆనియన్ చిప్స్, ఇప్పుడు కొత్తగా కాకర, క్యారెట్, గోరుచిక్కుడుకాయ లతో చిప్స్ అందుబాటులో ఉంటాయి. కానీ , బనానా చిప్స్ చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా కూడా చాలా చిన్నగా అంటే చిన్న సైజులో కనిపిస్తాయి.బనానా చిప్స్ తయారు చేసుకోవాలని భావిస్తే.. మెషీన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.అరటి కాయలను కడగడానికి ఒక వాష్ ట్యాంక్, వాటి తొక్క తియడానికి ఒక మెషీన్, అలాగే వాటిని కట్ చేయడానికి మరో మెషీన్, అరటి కాయ ముక్కలకు ఉప్పు కారం వంటివి కలిపేందుకు మరో మెషీన్‌, వాటిని ప్యాకింగ్ చేసే మెషీన్ ఇలా పలు రకాల మెషీన్లతో పని పడుతుంది. నూనె కూడా కావాల్సి వస్తుంది..


50 కేజీల చిప్స్ తయారు చేయాలంటే 120 కేజీల అరటి కాయలు కావాలి. 12 నుంచి 15 లీటర్ల నూనె అవసరం అవుతుంది. మెషీన్లు పని చేయడానికి డీజిల్ కూడా అవసరం అవుతుంది.మొత్తంగా 50 కేజీల చిప్స్ తయారు చేయడానికి రూ.3,200 వరకు ఖర్చవుతుంది. ఒక కేజీ చిప్స్ ప్యాకేట్ తయారీకి దాదాపు రూ.70 ఖర్చు వస్తోంది. మీరు ఒక్కో కేజీ చిప్స్‌ను రూ.90 నుంచి రూ.100 వరకు అమ్మొచ్చు. ఇలా మీరు రోజులకు ఎన్ని చిప్స్ అమ్మితే అంత లాభం వస్తుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.  చేతి కొద్ది డబ్బులు.. ఎలా లేదనుకున్న ఈ చిప్స్ మార్కెట్ చేస్తే రోజుకు కనీసం 3000 మిగులుతుంది.. అలా నెలకు లక్షలు సంపాదించుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: