ప్రపంచం అత్యంత అరుదైన, ఖరీదైన బిర్యానీ ఇదే..ధర ఎంతంటే..?

Satvika
బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. ఎందుకంటే ఆ రుచి అలాంటిది.. వెజ్ ప్రియులను కూడా తినాలని అనిపించేలా ఆకట్టుకుంటుంది. ఎప్పుడో ఒక సారి బిర్యానీని తినేవారు కొందరుంటే ఆ రుచికి ఫిదా అయి తరచూ బిర్యానీ తినేవారు కొందరుంటారు. అయితే బిర్యానీ ఖరీదు మహా అయితే ఎంత ఉంటుంది ? పేరుగాంచిన రెస్టారెంట్లలో అయితే రూ.250 మొదలుకొని రూ.350 వరకు ఉంటుంది. చికెన్‌, మటన్ బిర్యానీలకు ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఒక్కో హోటల్ లో ఒక్కో రుచి కూడా ఉంటుంది. ధర పెట్టేకొద్ది బిర్యానీ టెస్ట్ కూడా వేరే లెవెల్ లోకి ఉంటుంది. 



ఇకపోతే దుబాయ్ లోని ఓ హోటల్ లోని బిరియాని చాలా ఖరీదు అని అంటున్నారు.బాంబే బారో హోటల్ వారు తమ మొదటి యానివర్సరీ సందర్భంగా అక్కడ స్పెషల్ బిర్యానీని తయారు చేసి అందిస్తున్నారు. అయితే ఆ బిర్యానీలో పైన గార్నిష్ కోసం 23 క్యారెట్ల బంగారాన్ని వాడారు.అందుకని ఆ బిర్యానీ చాలా ఖరీదు అయింది. దాని ధర 1000 దిర్హామ్‌లు. మన కరెన్సీలో దాదాపుగా రూ.20వేలు. అవును నిజమే. ఇక ఆ బిర్యానీని 5-6 మంది సులభంగా తినవచ్చు. అందులో బిర్యానీతోపాటు కాశ్మీరీ ల్యాంబ్ సీక్ కబాబ్‌, ఓల్డ్ ఢిల్లీ ల్యాంబ్ చాప్స్‌, రాజ్‌పూత్ చికెన్ కబాబ్‌, మొగల్ కోఫ్తా, మలయ్ చికెన్‌లను కూడా అందిస్తారు. 



ఇక ఆ బిర్యానీకి హోటల్ వారు రాయల్ గోల్డ్ బిర్యానీగా పేరు తో పిలుస్తారు.దుబాయ్‌లోనే పొన్నుస్వామి రెస్టారెంట్ అని ఇంకో ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అందులో బాహుబలి థాలిని వడ్డిస్తారు. థాలి అంటే మీల్స్ అన్నమాట. అందులో అనేక రకాల డిషెస్ ఉంటాయి. చేపల వేపుడు, రొయ్యల వేపుడు, తందూరి చికెన్‌, పుట్ట గొడుగుల ఫ్రై, బ్రెడ్‌, పరోటా, రైస్, రసం, సాంబార్‌, స్వీట్లు ఆ మీల్స్‌లో ఉంటాయి. ఆ మీల్స్ ఖరీదు 135 దిర్హామ్‌లు. అంటే మన కరెన్సీలో రూ.2690 ఉంటుంది.చూసారుగా ఆ బిరియాని ఎంత ఖరీదు అయినదో అంత అరుదుగా దొరుకుతుందట..బాగా బలిసిన వాళ్ళు మాత్రమే తింటారట.. ఎంతైనా బిరియాని కోసం అంత పెట్టడం అంటే ఆలోచించాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: