మొబైల్ వినియోగదారులకు అమెజాన్ ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్..

Satvika
అమెజాన్ పేరు అందరికీ తెలిసిందే.. ఆన్ లైన్ మార్కెట్ పేరుతో ఈ సంస్థ జనాలను ఆకట్టుకుంటుంది. వరుస ఆఫర్ల తో రోజు రోజుకు ఫేమస్ అవుతుంది. దిగ్గజ కంపెనీగా అభివృద్ది చెందింది. అమెజాన్ కేవలం వస్తువుల కొనుగోలు మాత్రమే కాదు.. వినోదాన్ని కూడా అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ పేరుతో ప్రేక్షకులను వీడియోలను ,సినిమా లను చూసే అవకాశాన్ని అందిస్తుంది. ముఖ్యంగా టాప్ ప్లేస్‌లో ఉన్న నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో మధ్య ఈ పోటీ మరింత ఎక్కువగా ఉంది. ప్రైమ్‌తో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ కాస్త ముందుంది.



ఇకపోతే మొబైల్‌కు మాత్రమే పనికొచ్చే రూ.199 ప్లాన్ నెట్‌ఫ్లిక్స్‌కు అనుకూలంగా మారింది. అయితే ఇప్పుడు ప్రైమ్ వీడియో కూడా అదే రూట్‌లో వెళ్తోంది. ప్రపంచంలోనే తొలిసారి ఇండియాలో ఈ మొబైల్ ఓన్లీ ప్లాన్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ మేరకు ప్రీపెయిడ్ ఎయిర్‌టెల్ వినియోగదారులకు తొలి 30 రోజులు ఉచితంగా ట్ర‌య‌ల్ చేయ‌వ‌చ్చు. 89 రూపాయలు ప్లాన్ తో వాలిడిటీ 28రోజులు, 6 జీబీ డేటాను అందిస్తున్నారు..299 రూపాయల ప్లాన్ తో 28రోజుల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌లో  ప్రైమ్ వీడియోతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌.. రోజుకు 1.5 జీబీ డేటా వ‌స్తుంది.



మొబైల్‌ డేటా సేవలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ప్లాన్స్‌ తీసుకొచ్చామని అమెజాన్ ప్రైమ్ వీడియో వరల్డ్‌వైడ్ వైస్ ప్రెసిడెంట్ జే మెరైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ద్వారా ప్రత్యేకమైన, అసలైన కంటెంట్‌తో ప్రతి భారతీయుడిని అలరించనున్నామని తెలిపారు. కాగా ప్రైమ్ వీడియో సాంప్ర‌దాయ ప్లాన్ నెల‌కు రూ.129, సంవ‌త్స‌రానికి రూ.999గా ఉన్న విష‌యం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో లను వినియోగించే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో వినియోగ దారులు కూడా పెరుగుతారు అని అమెజాన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: