తెలంగాణలో కొత్త సంవత్సర వేడుకలకు ఘనంగానే స్వాగతం పలికిన మందుబాబులు!

SS Marvels
సాధారణంగా మనదేశంలో ఎక్కువ శాతం మంది ఒక వయసు దాటిన తరువాత అంటే టీనేజ్ దాటిన రువాత యుక్త వయసు నుంచి ముదుసలి వయసు వరకూ ఏ పండుగైనా, ప్రమోషన్ అయినా, పుట్టినరోజు అయినా, పెళ్లి యినా, ఏ వస్తువు కొన్నా ఇలా ఒకటి కాదు రెండు కాదు సందర్భం ఏదైనా సరే మిత్రులతోనో, సహోద్యోగులతోనో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. అలా వారు సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నా లేక చేసుకున్న ప్రతీసారీ కూడా వారికి గుర్తుకు వచ్చే మొదటి ఆప్షన్ మందు. అందుకే ఎన్ని ప్రభుత్వాలు అధికారం చేపట్టినప్పటికీ సంపూర్ణ మద్యపాన నిషేధంపై మాత్రం ఆయా ప్రభుత్వాలు ఆచితూచి అడుగులు వేస్తుంటాయి. అయితే నేటి నుంచి నూతన సంవత్సరాదిలోకి అడుగుపెడుతున్న వేళ.. తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. గత నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.759 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. 8.61 కోట్ల లిక్కర్ కేసులు.. 6.62 కోట్ల బీరు కేసులను విక్రయించినట్లు అబ్కారీ శాఖ తెలిపింది. ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేకపోయినప్పటికీ.. గత ఏడాదితో పోలిస్తే.. రూ.200 కోట్లు అధికంగా ఆదాయం రావడం విశేషం. డిసెంబర్‌ 28వ తేదీన రూ.205.18 కోట్లు, మరుసటి రోజు రూ.150 కోట్లు, 30న 211.35 కోట్లు, 31వ తేదీన రూ.193 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నాలుగు రోజుల్లోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రూ.300 కోట్ల మద్యం విక్రయాలు జరగడం గమనార్హం.


ఆంధ్రాకు సరిహద్దున ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.75.98 కోట్లు, వరంగల్‌లో రూ.63.49 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.53.87 కోట్లు, ఖమ్మం జిల్లాలో రూ.52.70 కోట్లు, కరీంనగర్‌లో రూ.50.78 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. డిసెంబర్ నెలలో రూ.2 వేల కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. డ్రంకన్ డ్రైవ్ కేసులు, పార్టీలకు అనుమతి లేని నేపథ్యంలో చాలా మంది మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి ఇళ్ల దగ్గర తాగడానికి మొగ్గు చూపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: