వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్.. జనవరి 1నుంచి అవన్నీ ఫ్రీ

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: కొత్త సంవత్సరానికి ఇంకా కొన్ని గంటలు మిగిులుండగానే టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి తమ వినియోగదారుల నుంచి ఎలాంటి కాల్ చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. జనవరి 1, 2021 నుంచి జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసినప్పటికీ ఎటువంటి చార్జీలూ వసూలు చేయమని వెల్లడించింది. ఇప్పటివరకు ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీలను(ఐయూసీ)ల రూపంలో ఒక నెట్ వర్క్ నుంచి వేరే నెట్‌వర్క్‌కు పై.1.6 చెల్లించే విధంగా ట్రాయ్ నిబంధనలు ఉన్నాయి.
దీంతో కనీస చార్జీల రూపంలో జియో కూడా వేరే నెట్ వర్క్‌లకు కాల్ చేసినప్పుడు తన వినియోగదారుల నుంచి కనీస మొత్తంలో చార్జీలు వసూలు చేస్తోంది. అయితే 2021 జనవరి 1 నుంచి ట్రాయ్ కొత్త నిబంధనలను అమలు చేయనుంది. దీని ప్రకారం ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జీలను ఎత్తివేయనుంది. వాటి స్థానంలో కొత్త ఏడాది నుంచి బిల్ అండ్ కీప్ విధానాన్ని అమలు చేయాలని ట్రాయ్ స్పష్టం చేసింది. దీంతో జియో కూడా తమ వినియోగదారుల ఇక నుంచి ఫ్రీ కాల్స్ అందించనున్నట్లు ప్రకటించింది.
ఇదిలా ఉంటే టెలికం రంగంలోకి జియో వచ్చిన కొత్తల్లో కేవలం డేటాకు మాత్రమే చార్జీ వసూలు చేసేది. ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకొనే అవకాశం కల్పించింది. అయితే ఈ విషయంపై మిగతా నెట్‌వర్క్‌లు ట్రాయ్‌కు ఫిర్యాదుచేయడంతో జియో కూడా ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసే వినియోగదారుల నుంచి కొద్ది మొత్తంలో చార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. దీంతో జియో వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్ చేసినప్పుడు నిమిషానికి 6 పైసల చొప్పున ఇన్నాళ్లూ వసూలు చేస్తూ వచ్చింది. దీనికోసం కాల్స్ కోసం రూ.10 నుంచి టాపప్ ఓచర్లతో రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే జియో టూ జియో కాల్స్‌ మాత్రం ఉచితంగానే ఉంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: