అక్కడ ఒక్క షేర్ కొంటే ఇంక డబ్బులే డబ్బులే..

Satvika
ఇటీవల కరోనా వైరస్ వల్ల జనజీవనం స్తంభించింది..ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తినడానికి తిండి లేక ఆకలి చావుకు బలైయ్యారు.. అయితే దాదాపు ఏడూ నెలలుగా ప్రజలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ఇప్పటికీ కూడా ప్రజలు అనేక ఇబ్బందులను చవి చూస్తున్నారు..ప్రభుత్వం ప్రజలకు కొంత వరకైనా ఆదుకోవాలని ప్రయత్నిస్తుంది.అందులో భాగంగా ప్రభుత్వం ప్రజలకు రుణాలను అందిస్తుంది. ఇండియన్ స్టార్టప్‌లు మాత్రం దుమ్ముదులిపేశాయి. యూనికార్న్ లిస్ట్‌లో పలు స్టార్టప్‌లు వచ్చి చేరాయి. కోవిడ్ 19 గడ్డు పరిస్థితుల్లోనూ 8 స్టార్టప్స్‌ యూనికార్న్ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. 2025 నాటికి దేశంలో 100 యూనికార్న్స్ ఉండొచ్చనే  టాక్ వినపడుతుంది.

అసలు విషయానికొస్తే.. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన షేర్ల విషయానికి వస్తే.. ఈవీ, ఈబీటా, ప్రైస్ టు బుక్ వ్యాల్యూ, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో వంటి పలు అంశాల ప్రాతిపదికన షేరు విలువను లెక్కగట్టొచ్చు.గ్రే మార్కెట్ లో ఆయా కంపెనీల వస్తువుల ఆర్ధిక వ్యవస్థను, వివిధ అంశాల ప్రాతిపదికన లెక్కిస్తారు. అందువల్ల లిస్ట్ అయిన కంపెనీల స్టాక్స్‌ను, వీటికి ఒక్కదానితో మరోక దానితో పోల్చడానికి వీలు ఉండదు.

 మరో విషయమేంటంటే.. గ్రే మార్కెట్‌లో ఈ కంపెనీల విలువ ఆకాశాన్ని తాకుతోంది. పలు స్టార్టప్‌లకు సంబంధించి షేరు విలువ మీరు ఊహించలేనంత స్థాయికి చేరింది. ఓయో రూమ్స్ షేరు విలువ ఏకంగా రూ.35-రూ.40 లక్షల మధ్యలో ఉంది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ షేరు విలువ రూ.2.7-2.8 లక్షల వరకు ఉంది. జొమాటో షేరు విలువ రూ.3.1 లక్షలుగా పలుకుతోంది. వీటిలో షేర్లు తీసుకోవడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు అని అంటున్నారు.. మరి ప్రస్తుత మార్కెట్ రేంజు ను బట్టి ఈ షేర్స్ ను తీసుకోవచ్చునని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.. ప్రస్తుతం పండగ సీజన్ కావున ఈ ఆఫర్లు మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: