ఎలాంటి చార్జీలు లేకుండా క్రెడిట్ కార్డు కావాలా? ఇది ట్రై చేయండి..!

Kothuru Ram Kumar

ఈ కరోనా కాలంలో... క్రెడిట్ కార్డుల వినియోగం, అవసరం.. రోజు రోజుకీ పెరుగుతూనే వుంది. ఇక అత్యవసర పరిస్థితులలో క్రెడిట్ కార్డుల ఉపయోగం గురించి అందరికి తెలిసినదే. సమయానికి మన దగ్గర పైసలు లేనప్పుడు ఇవి ఎంతగానో సహకరిస్తాయి. అలాగే... డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, రివార్డు పాయింట్లు... సంగతి చెప్పనక్కర్లేదు. కానీ క్రెడిట్ కార్డు తీసుకునే ముందు మనం చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే అనవసరమైన కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం..

 

ఎందుకంటే, క్రెడిట్ కార్డుల్లో వివిధ రకాలైన కార్డులు ఉంటాయి. మన అవసరాలకు, అదే టైంలో మన నెలవారీ సంపదను బేరేజి వేసుకొని మేలైన కార్డును ఎంపిక చేసుకోవడం మంచోడి లక్షణం. వీలైనంతవరకు వార్షిక ఫీజు లేనటువంటి క్రెడిట్ కార్డు పొందటానికి ప్రయత్నించాలి. ఇపుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇదే రకమైన కొత్త క్రెడిట్ కార్డును మనకోసం తీసుకువచ్చింది. దీని పేరే 811 డ్రీమ్ డిఫరెంట్ క్రెడిట్ కార్డు. 

 

ఈ కార్డు కేవలం, కోటక్ 811 కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందింది. దీనికి ఎలాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే ఈ కార్డును రిసీవ్ చేసుకోవచ్చు. కొత్త కస్టమర్లు కూడా ఈ కార్డు పొందవచ్చు. అది ఎలా అంటే, ముందు 811 సేవింగ్స్ అకౌంట్‌ను తెరిచి, రూ.15,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసాక, ఈ లైఫ్‌టైమ్ ఉచిత క్రెడిట్ కార్డును మీ సొంతం చేసుకోవచ్చు. 

 

811 క్రెడిట్ కార్డు ప్రత్యేకతలు:
ఎలాంటి క్రెడిట్ హిస్టరీతో పని లేదు. 
ఇన్‌కమ్ ప్రూఫ్ అవసరం లేదు. 
క్రెడిట్ కార్డుకు ఎలాంటి చార్జీలు వర్తించవు. (జాయినింగ్ ఫీజు-యాన్వల్ ఫీజు)
48 రోజుల వరకు వడ్డీ రహిత కాలం.
డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీ.
ప్రతి రూ.100 కొనుగోలుపై 2 రివార్డు పాయింట్లు. 
ఫ్యూయెల్ సర్‌చార్జ్ మినహాయింపు 1%.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: