ఆడపిల్లల అకౌంట్లలోకి 36,000 రూపాయలు.... దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఎప్పటివరకంటే....?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా విజృంభణ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఢిల్లీ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. లడ్లీ స్కీమ్ గడువును ఆగస్టు నెల వరకు పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వం గడువు పెంచడంతో ఈ స్కీమ్‌లో చేరేందుకు గడువు మరింత పెరిగింది. 
 
ఈ స్కీమ్ లో చేరడానికి ఆగస్టు నెల 31వ తేదీలోపు దరఖాస్తును సమర్పించవచ్చు. వితంతువుల ఆడ పిల్లలు, అనాధలైన ఆడ పిల్లలు కూడా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్ నెల 31 వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు ప్రభుత్వం గడువును నిర్దేశించింది. 2008 సంవత్సరంలో ఢిల్లీ గవర్నమెంట్ లడ్లీ స్కీమ్‌ను ప్రారంభించగా నేటికీ ఈ పథకం అక్కడ అమలవుతోంది. 
 
ఈ పథకం కింద బాలికల ఖాతాలలో రూ.35,000 నుంచి రూ.36,000 వరకు ఆర్థిక సాయం జమవుతుంది. అకౌంట్లలో అమ్మాయి పుట్టిన దగ్గరి నుంచి ఇంటర్ పూర్తి చేసేంత వరకు విడతల వారీగా నగదు జమ కానుంది. 2008 జనవరి 1 నుంచి పుట్టిన ఆడ పిల్లలు ఈ పథకానికి అర్హులవుతారు. ప్రభుత్వం ఆడపిల్ల ఆస్పత్రిలో పుడితే పుట్టిన వెంటనే రూ.11,000 జమ చేస్తుంది. ఇంటి వద్దనే కాన్పు అయితే 10,000 రూపాయలు జమ చేస్తుంది. 
 
పాప ఒకటో తరగతి చేరిన వెంటనే రూ.5,000, ఆరో తరగతిలో రూ.5,000, 9వ తరగతిలో రూ.5,000, 12వ తరగతిలో రూ.5,000 ఇలా మొత్తం 35 వేల నుంచి 36వేల వరకు జమవుతాయి. ఈ స్కీమ్‌లో చేరేందుకు కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష దాటకూడదు. దరఖాస్తు చేసుకునేవారు ఢిల్లీలో కనీసం మూడేళ్లుగా నివాసం ఉండాలి. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడ పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: